నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 4 : పరీక్షలు అంటేనే ఓ తెలియని భయం విద్యార్థుల్లో నెలకొంటుంది. రెండు ఏండ్లుగా కష్టపడి చదివి పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. అందరిలో ఫస్ట్‌క్లాస్ రావాలన్న తపన ఉంటుంది. ఆ సమయంలో కొందరు విద్యార్థులు భయాందోళనలకు గురికావడం.. తీవ్ర ఒత్తిడికి గురువ్వడం చూస్తుంటాం.. అలాంటి వత్తిడిలకు…భయాలకు చోటు ఇవ్వకుండా విజయమే లక్ష్యంగా ముందడుగు వేసి లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యావేత్తలు ఇంటర్ విద్యార్థులకు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఒకేషనల్ కోర్సుకు సంబంధించిన పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నది. ఈ పరీక్షలకు మహబూబ్‌నగర్ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 8,916, ఒకేషనల్ 2006 మొత్తం 10,922 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ద్వితీయ సంవత్సరం జనరల్ 8269, ఒకేషనల్ 1721 మొత్తం 9,947 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
గద్వాల జిల్లాలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ 3,260 మంది, ద్వితీయ సంవత్సరంలో 3,396మంది, అలాగే ఒకేషనల్ కోర్సు విద్యార్థుల మొదటి సంవత్సరంలో 797మంది, ద్వితీయ సంవత్సంలో 715 మంది విద్యార్థులు హజరుకానున్నారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యార్థులు 173మంది విద్యార్థుల పరీక్షలు రాయనున్నారు. మొత్తం 8,341మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించిన 6,477, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 6,977 మంది మొత్తం 13,454 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వనపర్తి జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటి సంవత్సరం విద్యార్థులు 6,457, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,693 మంది మొత్తం 12,150 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. నారాయణపేట జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 8,791 మంది పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఉన్న నిముషం ఆలష్యాన్ని నిబంధనను ప్రభుత్వం సడలించింది.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
వనపర్తి, టౌన్ మార్చి 4 : నేటి (బుధవారం) నుంచి జరుగనున్న ఇంటర్ పరీక్షలకు హాజరైయ్యే వి ద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా, పరీక్షలు రాయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇ ష్టంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయానికి హాల్ టికెట్, పెన్ను లు, పెన్సిళ్లు, ప్యాడ్లతో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయ న సూచించడంతోపాటు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు.