మహబూబ్నగర్ అర్బన్, జనవరి 25: జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్పల్లి బ్రదర్హుడ్ క్రికెట్ అకాడమీలో శనివారం టీడీసీఏ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల ఎంపికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా టీడీసీఏ జిల్లా కన్వీనర్ నవీన్కుమా ర్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 31వరకు హైదరాబాద్ దోమలగూడ ఫి జికల్ ఎడ్యుకేషన్ కళాశాల మైదానంలో జరిగే అం డర్-17 టీ20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు.