వనపర్తి, జనవరి 21 : వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు ఆపద లో అండగా నిలుస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. కడుకుంట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చిలుక సాయికృష్ణ మృతి చెందడంతో పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును ఆదివారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో మృతుడి భార్య గీతకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని, మీకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మున్ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ తరఫున ఎండగట్టాలన్నారు.
స్థానిక, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తారని, అందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల మధ్యలో ఉండాలన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజశేఖర్‌గౌడ్ కుమారుడు రేవంత్‌గౌడ్ రోడ్డు ప్రమాదంలో చేయి విరిగి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. పట్టణంలోని స్టాంప్ వెండర్ మొల్గర బాలచంద్రుడు అ నారోగ్యంతో మృతిచెందగా.. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ అశోక్, బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణి క్యం, కౌ న్సిలర్లు కృ ష్ణ, శేఖర్, రవి, నా యకులు వెంకటేశ్, తిరుమల్, రవికుమా ర్, చంద్రశేఖర్‌యాదవ్, మా ధవరెడ్డి, జాత్రునాయక్, వేణుగోపాల్, శివన్నసాగర్, వెంకటసాగర్, జోహెబ్ ఉన్నారు.