అయిజ, జూన్ 10 : తుంగభద్ర డ్యాం గేట్లకు చైన్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈఈ విజయ్ సారథి, అసిస్టెంట్ అడ్వైజర్ కృష్ణారావు ఆదేశించారు. బుధవారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం స్పిల్‌వే గేట్లను విజయవాడ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి చెందిన ఇంజినీర్లు తనిఖీ చేశారు.
ఇటీవల తుంగభద్ర డ్యాంకు 33 క్రస్ట్‌గేట్ల బిగింపు, ప్రస్తుతం చైన్ల పనులను పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్‌ను ఆదేశించారు. వారి వెంట ఈఈ చంద్రశేఖర్, ఎస్డీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి, సెక్షన్ అధికారి కిరణ్ పాల్గొన్నారు.