ఊట్కూర్, జూలై 24: ‘ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు’ అంటూ ప్రచారం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం మంత్రి సిఫారసు ఉంటేనే ఇల్లు మంజూరవుతుందనే వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఊట్కూర్ మం డల సమీక్షా సమావేశంలో జిల్లా హౌ సింగ్ పీడీ శంకర్ నాయక్ చేసిన ఈ వ్యా ఖ్యలపై సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘మంత్రి సిఫారసు లేకుం టే పేదలకు ఇళ్లు రావా..? అయితే ప్రభు త్వం చేస్తున్న హామీల పరిస్థితి ఏమిటి..? అంటూ నిలదీయడంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది. చివరకు తన వ్యాఖ్యలను పీడీ సవరించుకోవాల్సి వ చ్చింది. శుక్రవారం మండలపరిషత్ కా ర్యాలయంలో ఎంపీడీవో పావని అధక్షతన జరిగిన సమావేశంలో మండల ప్రత్యేకాధికారి హోదాలో జిల్లా హౌజింగ్ పీడీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. అధికారులు గ్రామాలకు వచ్చినా స్థానికంగా తమకు సమాచారం ఇవ్వడం లేదని, ఇందిరమ్మ ఇండ్ల్ల ప్రారంభోత్సవాలు కూడా సర్పంచులకు తెలియకుండా నిర్వహిస్తున్నారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మండలంలోని మొగ్దుంపూర్, కొత్తపల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు తిరుమలేశ్, నర్సింహులు మాట్లాడుతూ..పూరి గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల పేర్లను అధికారులు తీసుకున్నా, ఇళ్ల మంజూరులో ఎలాంటి పురోగతి లేదన్నారు. దీనికి స్పందించిన హౌజింగ్ పీడీ ‘గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. మంత్రి సిఫారసు ఉంటేనే ఇల్లు మంజూరు అవుతుంది’ అని వ్యా ఖ్యానించారు. దీంతో సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అయితే ప్రభు త్వం చెబుతున్న అర్హులందరికీ ఇల్లు అనే హామీ కేవలం మాటలకే పరిమితమా? అని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పీడీ తన వ్యాఖ్యలను సవరించి వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై కూడా సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. చిన్నపొర్ల సర్పంచ్ నికిత మా ట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. పలుమార్లు అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదని, జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చి నిలదీస్తున్నారని, వెంటనే ఉపాద్యాయులను నియమించకపోతే పాఠశాలకు తాళం వేస్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా ఎంఈవో మా ధవి హామీతో ఆమె శాంతించారు.
పెద్దజట్రం సర్పంచ్ వెంకటేశ్ మాట్లాడుతూ..ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవ నం నిర్మించి సంవత్సరాలు గడిచినా స్థల వివాదం కారణంగా విద్యార్థులు ప్రార్థనలు, క్రీడలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ స్థలంలో పాఠశాల నిర్మించాలని డిమాండ్ చేశారు. పగిడిమర్రి సర్పంచ్ జాఫర్ మాట్లాడుతూ, అంగన్వాడీ సరుకులను వెహికల్ ఏజెం ట్, సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారని అరోపిస్తూ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో తాసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీవో పావనితోపాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.