చారకొండ, ఫిబ్రవరి 5 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి అహంకార వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సీఎం హోదా మరిచిపోయి వీధి రౌడీల్లాగా మాట్లాడుతున్నారన్నారు.
కేసీఆర్పై విషం కక్కుతున్న సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు చండీశ్వర్గౌడ్, జీబీఆర్ యూత్ అధ్యక్షుడు గణేశ్, బీఆర్ఎస్ నాయకులు మహేశ్, బాలయ్య, గంగరా జు, రవి, రమేశ్, మహేందర్, మధు, సాయికుమార్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.