
ధన్వాడ, డిసెంబర్14 : యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై మంగళవారం మండలంలోని గోటూర్ రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ వరికి బదులుగా ఇతర పం టలను సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడితో నేల సారవంతం పెరుగుతున్నదన్నారు. వరి సాగుకు బదులుగా వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, కూరగాయల సా గు చేయాలని సూచించారు. ఆయుర్వేద మొక్కలు పెంచడంతో రైతులకు మంచి ఆదాయం పొందవచ్చునన్నారు. అదేవిధంగా సాగులో తెలియని విషయాలు ఉంటే మండ ల వ్యవసాయాధికారి అందుబాటులోనే ఉంటారని, ఆయనను అడిగి తెలుసుకోవాలన్నా రు. అనంతరం రైతులకు ఆరుతడి పంటల సాగు వాల్‌పోస్టర్లను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఏవో ప్రదీప్‌కుమార్, సర్పంచ్ నారాయణరెడ్డి, ఏఈవో జైన్‌సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులు వినియోగించాలి
రైతులు రసాయన ఎరువుల వాడ కం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ అన్నారు. మండలంలో ని అన్నాసాగర్ రైతు వేదికలో రైతు అ వగాహన సదస్సు సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ వరి కి బదులుగా రైతులు ఇతర పంటలు వేసుకోవడంతో అధిక దిగుబడితోపా టు లాభాలు వస్తాయని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. పం టల్లో పశువుల పేడ వాడకం ద్వారా రైతులకు పెట్టుబడి భా రం చాలా వరకు తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. నా ణ్యమైన విత్తనాల ఎంపిక, కలుపు మందుల వాడకం తదితర విషయాల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అరవింద్, సర్పంచ్ రాములు, రైతులు పాల్గొన్నారు.