కోస్గి, నవంబర్ 16 : దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి ఈనెల 11వ తేదీన వచ్చిన కలెక్టర్, అధికారులపై రైతులు దాడి చేసిన సంఘట న రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మా రింది. తర్వాత దాడికి పాల్పడ్డారం టూ పలువురి అక్రమంగా అరెస్టు చే సి రిమాండ్‌కు తరలించారు. శనివా రం మరో నలుగురిని అదుపులోకి తీ సుకొన్నారు.
లగచర్లకు చెందిన నీ రటి సాయిలు, నీరటి అంజయ్య, మ దరప్ప, రోటిబండ తండాకు పాలు పోసేందుకు వెళ్లిన పులిచర్లకుంట తం డాకు చెందిన రూప్లాయక్ను పోలీసు లు అరెస్టు చేశారు. పోలీసుల పహారా ఇంకా కొనసాగుతున్నది. అయితే ల గచర్లతోపాటు రోటిబండ తండా, పు లిచర్లకుంట తండా వాసులు ఎప్పు డేం జరుగుతుందోనని జంకుతున్నా రు. వరుస అరెస్టులతో ఆందోళన చెం దుతున్నారు. పోలీసులు మమ్మల్ని చంపినా భూములు మాత్రం ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. భయం.. భయం మధ్య జీవిస్తున్నారు.