కొల్లాపూర్, మే 19 : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే కొల్లాపూర్ మార్కెట్ యార్డు ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ధర్నా చేపడుతామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మార్కెట్ యార్డులో తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొలకలొచ్చిన వడ్లను, బూజు పట్టిన మొక్కజొన్నలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు రోజుల కిందట మార్కెట్ యా ర్డుకు మంత్రి వచ్చి రెండురోజుల్లో ధాన్యం కొనుగో లు చేసి మార్కెట్ యార్డ్డు అంతా క్లీన్ చేస్తామని చె ప్పారన్నారు. కానీ ఇక్కడి వచ్చి చూస్తే పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
సొంత జిల్లాకు ఒరిగిందేమీ లేదు
జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయితే అద్భుతాలు జరుగుతాయని రైతులంతా ఉహించుకుందని, కానీ ఈ రోజు సీఎం సొంత జిల్లాలోనే రైతుల గోస వర్ణనాతీతంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బీరం విమర్శించారు. గతంలో కరోనా వంటి కష్టకాలంలో కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో 1,50,000 టన్నుల ధాన్యం రైతులు ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ ప్రభు త్వం కొనుగోళ్లు చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు పండించిన పంట కళ్ల ముందే పాడైపోతుంటే, అన్నం కూడా తినలేకపోతున్నామని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే కొల్లాపూర్ మార్కెట్ యార్డును క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. అలాగే రైతాంగానికి అందుబాటులో ఉండకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మార్కెట్ కమిటీ సెక్రటరీ, ఇతర బాధ్యతగల అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
రాత్రి వేళల్లో దొంగ కాంటాలు
నాకంటే వెనుక వచ్చినోళ్లవి కాంటాలు పెట్టి లారీ లు ఎక్కిస్తున్నారని నా ధాన్యం మాత్రం ఎత్తడం లేదని మహిళా రైతు మున్నెమ్మ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎదుట వాపోయింది. లంచా లు ఇచ్చిన రైతుల ధాన్యాన్ని రాత్రి వేళల్లో దొంగ కాం టాలు వేస్తున్నారని తన వద్ద లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతోనే తనకు నరకయాతన చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే ముందు కన్నీటిపర్యం కావడంతో మాజీ ఎమ్మెల్యే వెంటనే ఫోన్లో ఆర్డీవో బన్సీలాల్‌కు ఫోన్ చేసి మహిళ ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో పరిశీలించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా మహిళా రైతును ఇబ్బంది పెట్టినట్లు అయితే బీఆర్ఎస్ అండగా ఉం టుందని మహిళా రైతుకు ఆయన భరోసా ఇచ్చారు.