గద్వాల, అక్టోబర్ 25 : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే దిక్కని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలకు కరెంటిచ్చే బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ధరూర్ మండలం గుడ్డెందొడ్డికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 60మంది సర్పంచ్ రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో, ధరూర్‌కు చెందిన 35మంది ఎంపీటీసీ దౌలన్న ఆధ్వర్యంలో, మల్దకల్ మండలం నేతువానిపల్లికి చెందిన 110మంది, నీలిపల్లికి చెందిన వెంకటన్న, మీసాల కృష్ణ, కోటిరెడ్డి, సవారి, పరమేశ్, సంజన్న, హనుమంతు, రాజు, ఉలిగేపల్లికి చెందిన 60మంది, కేటీదొడ్డి మండలం సోంపురానికి చెందిన 20మంది బుధవారం బీర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలించే ప్రాంతాల్లో లేని పథకాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో నేరుగా ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే పథకాలు ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అంటుంది.. ఇటువంటి పార్టీలకు మనం ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు ఈరన్న, సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్, వెంకటన్న, ఆలయకమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు రమేశ్‌రెడ్డి, మధునాయకి, శేషాద్రినాయుడు, సత్యంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విక్రమసింహారెడ్డి, అబ్రహం, దేవన్న తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్, అక్టోబర్ 25 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బుధవారం మండల కేంద్రంతోపాటు నాగర్‌దొడ్డి, తాటికుంట గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నాగర్‌దొడ్డిలో ఎమ్మెల్యే పర్యటించగా బీజేపీ ముఖ్య నాయకులు తిరుమల్‌రెడ్డి, శరత్‌రెడ్డి, రాముడు, వీరేశ్, జయన్న, ఉపేంద్రగౌడ్, పరశురాముడు, వెంకటన్న, కిష్టన్న, శంకర్, గౌరన్న, కుర్వ నరేశ్, వీరేశ్, బండి నర్సింహులుతోపాటు 50మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మల్దకల్‌కు చెందిన బీజేపీ మాజీ ఎంపీటీసీ కుర్వ తిమ్మప్ప తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కారెక్కారు. అలాగే తాటికుంటలో బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ భవిష్యత్‌లో న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు పురుషోత్తంరెడ్డి, ప్రతాప్, రాజు, ఎంపీటీసీలు జయమ్మ నర్సింహులు, మార్కెట్‌యార్డు డైరెక్టర్ సవారన్న, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విక్రంసింహారెడ్డి, అజయ్, చంద్రశేఖరెడ్డి, తూంక్రిష్ణారెడ్డి, సుధాకర్‌గౌడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.