బిజినేపల్లి : రాబోయే వర్షాకాలంలో ఎక్కడైనా పిడుగుపాటుకు ( Lightning ) జీవాలు మృతిచెందితే సమాచారం ఇవ్వాలని జిల్లా వెటర్నరీ ఇన్చార్జి అధికారి (Veterinary Officer) జ్ఞానశేఖర్ అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టెం, బిజినేపల్లి గ్రామాల్లో పశు వైద్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వేసిన గాలికుంటు టీకాల వివరాలను వందశాతం ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినిత్యం అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. రెండు నెలల్లో మళ్లీ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. అనంతరం కార్యాలయంలో పలు రకాల రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవిత , జ్యోతి, రుక్సానా బేగం, పర్వతాలు ఉన్నారు.