ఇటిక్యాల జనవరి 12 : గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఉదండాపూర్, శనిగపల్లి గ్రామ పంచాయతీ భవనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, జెడ్పీటీసీ హన్మంతురెడ్డి, సర్పంచులు అయ్యమ్మ, పావని, గోవర్ధన్‌రెడ్డి, మల్లన్న, రవీందర్‌రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాందేవ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుందర్లక్ష్మీనారాయణరెడ్డి, బాలకృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.