మహబూబ్నగర్ కలెక్టరేట్, జనవరి 28: పురాతన కాలం నుంచి నేటివరకు విస్తృత కాలక్రమానుగత చరిత్ర ఉట్టిపడేలా ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ‘హిస్టరీ ఎగ్జిబిషన్’ నిర్వహించారు. విద్యార్థులు పురాతన నాగరికతలు, మధ్య, ఆధునికయుగాలు, సమకాలీన ఘటనలను ప్రదర్శించారు. కాలక్రమ పరిధి మానవ సమాజాల అభివృద్ధి, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడేలా అనేక రకాలైన అంశాలపై విశదీకరించారు. ప్రాంతాల సంఘటనలు, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు, మానవ జీవితంలో సామాజిక అంశాలపై అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు.
వివిధ దేశాలు, ఖండా లు, నాగరితల చరిత్రలు, ఆయా కాలాల్లో నాణేల వినియోగం, వాటి రూపాలు ప్రదర్శించారు. మొత్తం 60 రకాలైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.పద్మావతి మాట్లాడుతూ.. చరిత్రను ముందు తరాలకు అందించాలని సూ చించారు. చరిత్ర మేథో, సాంస్కృతిక ఉద్యమా లు, ఆలోచనలు, తత్వాలను అన్వేషిస్తుందన్నా రు. చరిత్రకారులు శాస్త్రీయ పురోగతి, కళ, సాహి త్యం, మేధో ధోరణులను అధ్యయనం చేసేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో హిస్టరీ హెచ్వోడీ డా.శివప్రసాద్, అధ్యాపకులు ఆరీఫా, శివశంకర్, రాఘవేందర్, కురుమూర్తి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.