మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాస్టర్‌ప్లాన్‌లో కేటాయించిన విధంగా భ వన నిర్మాణాలు, రహదారులు, లింక్‌రోడ్లు ఉండేలా క చ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆబ్కారీ, క్రీడా శా ఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. బుధవా రం హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ముడా, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌లో ప్రభుత్వ స్థలాలు, దేవాలయ భూములు, వక్ఫ్ స్థలా లు, చెరువు బఫర్జోన్స్, హిల్స్ ఏరియాలను పరిరక్షించాలన్నారు. మహబూబ్‌నగర్‌కు అతి సమీపంలో రీజియల్ రింగ్‌రోడ్డు వస్తున్నందున మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అభివృద్ధి మౌలిక సదుపాయల కల్పన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రమేశ్‌బాబు, డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్, ముడా డిప్యూటీ డైరెక్టర్ మాజీద్, హెచ్ఎండీఏ చీఫ్‌ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమేశ్ ఉన్నారు.