జడ్చర్ల, నవంబర్ 26: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి అత్యధిక ధరలు వస్తున్నాయి. పత్తికి శనివారం ధరలు తగ్గాయి. శనివా రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యానికి అత్యధికంగా రూ. 2,424ధర పలికింది. అదేవిధంగా పత్తికి అత్యధికంగా రూ. 8,910 ధర వచ్చింది. మార్కెట్కు శనివారం పత్తి, ధాన్యం, మొక్కజొన్న, అమ్మకానికి వచ్చాయి. మార్కెట్కు 4,757 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాళుకు గరిష్ఠంగా రూ.2,424, కనిష్ఠంగా రూ.1,705 మధ్యస్తంగా రూ.2,056 ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 584క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.8,910, కనిష్ఠంగా రూ.6,912 మధ్యస్తంగా రూ. 8,790 ధర పలికింది.
అదేవిధంగా 818క్వింటాళ్ల హంస ధాన్యం అమ్మకానికి రాగా దానికి క్వింటాకు గరిష్ఠంగా రూ. 1,979, కనిష్ఠంగా రూ.1,537 మధ్యస్తంగా రూ. 1,709ధర పలికింది. అదేవిధంగా 1,121క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,201, కనిష్ఠంగా రూ. 1,810 మధ్యస్తంగా రూ.2,141ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 84 క్వింటాళ్ల శ్రీ రామ్గోల్డ్ రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,389 ధర పలికింది.