కొల్లాపూర్, జనవరి 7 : మండలంలోని సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున దంపతులు శనివారం దర్శించుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సం పత్కుమార్శర్మ నేతృత్వంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
న్యాయమూర్తి దంపతులకు తాసిల్దార్ రమేశ్, ఎస్సై బీవీ రమణా యాదవ్ వేర్వేరుగా పూలమొక్కలను అందజేశారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీ మోహన్‌బాబు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.