వనపర్తి టౌన్, ఆగస్టు 30 : చిన్నపిల్లల ర క్షణ, వారి బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎస్‌జే అనిల్‌కుమార్ జూకంటి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తికి కలెక్టర్ ఆదర్శ్ సురభి స్థానిక ఆర్అండ్బీ గృహంలో సాదరంగా ఆహ్వానం పలికారు.
అనంతరం కలెక్టర్, జిల్లా జడ్జితో కలిసి నాగవరం శివారులోని సర్వేనెంబర్ 200లో నూతన కోర్టు భవన నిర్మాణానికి ప్ర భుత్వం ద్వారా కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ప్రతిపాదిత ఆత్మకూరు, పెబ్బేరు బైపాస్ రోడ్డును పరిశీలించి రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందిగా కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా జడ్జి ఎంఆర్ సునీత, అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, సీనియర్ సివిల్ జడ్జీలు కళార్చన, రజిని, అశ్విని, హై కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ఆర్డీవో సుబ్రమణ్యం, రోడ్డు భవనాల ఇంజినీర్ దేశ్యానాయక్ తదితరులు ఉన్నారు.