బాలానగర్(జడ్చర్లటౌన్), జూన్ 10 : వాహనాలు న డిపించే వారికి హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం..ప్రాణ రక్షణకు కవచమని తెలంగాణ రోడ్డు సేఫ్టీ, ఆర్గనైజేషన్, ఆఫ్ హోంగార్డ్స్ విభాగం డీజీపీ స్వాతిలక్రా అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం అరైవ్..అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కుటుంబసభ్యులు మీ కోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వాహనదారులు వాహనాలను నడపాలని సూచించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ధ రించకపోవడంతో కలిగే అనర్థాలను వివరిస్తూ కు టుంబ పెద్ద ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక, మానసిక ఇబ్బందులను గురించి వివరించారు. ప్రతిఒక్కరూ తమ కుటుంబసభ్యుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులకు వైద్య సాయం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశా లు ఎక్కువగా ఉంటాయన్నారు. డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటివి రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణామయ్యే అంశాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించటంతో ప్రతిఒక్కరూ తమ ప్రాణాలతోపాటు ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడగలరని వివరించారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సం దర్భంగా హాజరైన విద్యార్థులు, డ్రైవ ర్లు, స్థానికులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు ఎస్పీ జానకి అరైవ్,అలైవ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం బైక్ వాహనాదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, నేషనల్ హైవే అథారిటీ ఇంజినీర్ భానుమిశ్రా, జడ్చర్ల రూరల్ సీఐ మహేశ్, కళాశాల ప్రిన్సిపాల్ సౌమ్య, డాక్టర్ నేహ, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సై నరేందర్, పోలీస్ అధికారులు, డ్రైవర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.