ఉట్నూర్, జూన్ 10 : పాఠశాలలు, గురుకులాలు పునఃప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది. వీటిలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం 24 రకాలతో కూడిన ‘వెల్కం కిట్’ను అందిస్తుంది. పాఠశాలలు ప్రారంభానికి ముందే అంటే మే నెలలోనే టెండర్లు పిలిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బా, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు ఉచితంగా అందిస్తారు. ఈ ఏడాది సరఫరా కోసం సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ నేతృత్వంలో ఏజెన్సీ టెండర్ ప్రక్రియ చేపట్టింది. మేలో తొమ్మిది రకాల వస్తువుల టెండర్ గడువు ముగిసి నెల రోజులు దాటినా ఏజెన్సీలను ఖరారు చేయలేదు. మిగిలిన వస్తువుల టెండర్ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. దీంతో వెల్కం కిట్లు సకాలంలో అందడం అనుమానంగానే కనిపిస్తున్నది.
కిట్‌లో వస్తువులు..
తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ టెక్స్బు క్స్, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరాజర్, స్కే ల్, స్కూల్ యూనిఫాం రెండు సెట్లు, బెల్ట్, టై, స్కూల్ షూ, సాక్సులు, స్కూల్ బ్యాగ్, ట్రంక్ పె ట్టే, దుప్పటి, దిండు, దిండు కవర్, టవల్, స్టీల్ ప్లేట్, గ్లాస్, స్పూన్ సెట్, స్వెట్టర్, వింటర్ జాకెట్, లోదుస్తులు, సబ్బు, సబ్బు డ బ్బా, టూత్ పెస్ట్, బ్రష్, దువ్వెన, నేయిల్ కట్టర్, హెయిర్ అయిల్, కుట్టు సామాన్, రెయిన్ కోట్, అంబ్రెల్లా, హ్యాండ్ కర్చిఫ్, లంచ్ బాక్స్‌లతో కూడిన కిట్ ఉంటుంది.
నాణ్యమైన వస్తువుల ఎంపిక విధానం
ప్రభుత్వం వెల్కం కిట్ సరఫరా చేసేటప్పు డు ప్రాజెక్ట్ మెనేజ్మెంట్ యూనిట్(పీఎం యూ) ఒక ప్రత్యేక టీం ఉంటుంది. వీరు ఏ వస్తువులు కావాలో లిస్ట్ తయారు చే యడం, టెండర్ నోటిఫికేషన్ వెబ్సైట్లో పెట్టడం, వచ్చిన కొటేషన్స్ చేసి ఏజెన్సీని సెలెక్ట్ చేయడం, వర్క్ ఆర్డర్ ఇచ్చి, సప్లయ్ టైంలో క్వాలిటీ చెక్ చేయడం వంటివి చే స్తారు. వీటిని రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తారు. ప్రతి గురుకులంలో ప్రిన్సిపాల్, స్టోర్ కీపర్ ఉంటారు. వాళ్లపని స్టేట్ పీఎంయూ నుంచి వచ్చిన సామాను తీసుకొని విద్యార్థులకు పంపిణీ చేయడం.
సరఫరా కాలేదు.. ; అగస్టీయన్, ఆర్సీవో, ఉట్నూర్ గురుకులం
గురుకులాలకు వచ్చిన విద్యార్థులకు 24 రకాల సామగ్రితో వెల్ కం కిట్ అందిస్తాం. ఈ సంవత్సరం ఇంకా రాలేదు. త్వరలోనే వస్తాయి. రాగానే ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని గురుకులాల లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తాం.