మహబూబ్‌నగర్ అర్బన్/నాగర్‌కర్నూల్/అలంపూర్/వెల్దండ/నవాబ్‌పేట, జూన్ 6 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసింది. వర్షపు నీటితో గడియారం చౌరస్తా, రాంమందిర్ చౌరస్తా, పద్మావతి కాలనీ, వన్‌టౌన్, పాతపాలమూరు, శివశక్తినగర్ ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా జిల్లాలోని మహ్మదాబాద్‌లో 11.8 మి.మీ. వర్షం కురవగా.. జిల్లా వ్యాప్తం గా భారీ వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జి ల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో నిలిచిన వర్షపు నీటి తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పునాది లేకుం డా నిర్మించిన డిగ్రీ కళాశాల ప్రహరీ వర్షానికి నేలమట్టమైంది. నిర్మాణం చేపట్టిన సంవత్సరానికి చిన్నపా టి వర్షానికే కూలిపోయింది. అలంపూర్‌లో గత రాత్రి కురిసిన భా రీ వర్షానికి పట్టణంలో ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. ప్రధానంగా ప్రభు త్వ జూనియర్ కళాశాల ఆవరణ ఎదుట, వెనుక భాగం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయిం ది. కళాశాలలోకి వె ళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ప్రభుత్వ బాలుర ఉ న్నత పాఠశాలలో కూ డా వర్షపు నీరు నిలిచిం ది. అక్బర్పేట కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ఇం డ్లల్లోకి చేరుతున్నది.
డ్రైనేజీ వ్య వస్థను మెరుగుపర్చాలని పలుమార్లు మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున సుమారు 68.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు బేగారి జంగమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందగా.., ఆమె భర్త కృష్ణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీం తో ఆయనను కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. భార్యాభర్తలు పొలంలో పత్తి, జొన్న విత్తనాలు వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. అదే విధంగా మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు రాచూర్, పెద్దాపూర్ తదితర గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నవాబ్‌పేట మండలంలో సుమారు రెం డు గంటల పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకల్లో వరద నీరు పారింది. తీగల్‌పల్లి గ్రామంలో చెట్టుపై పిడుగు పడగా ఇందిరమ్మకు చెందిన గేదె మృతి చెందింది. గేదె విలువ సుమారుగా రూ.లక్ష ఉంటుందని ఇందిరమ్మ తెలిపారు.