
అయిజ, నవంబర్ 28 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతం లో కురుస్తున్న మోస్తరు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొన సాగుతున్నది. దీంతో 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్ ఫ్లో 21,790 క్యూ సెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 17,412 క్యూ సెక్కులు ఉన్నది. 100.855 టీఎంసీల గరి ష్ట సామ ర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్ర స్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటిమట్టానికి గానూ ప్రస్తుతం 1633 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఆదివారం ఆనకట్టకు 18,843 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 18,400 క్యూ సెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపా రు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.6 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 443 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
6గేట్లు ఎత్తివేత
సుంకేసుల జలాశయానికి వా రంరోజులుగా వరద కొనసాగుతున్నది. డ్యాంకు ఎగువన కురుస్తున్న వర్షాలు, కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో డ్యాం జలకళ సంతరించుకున్నది. ఆదివారం ఎగువ నుంచి 27,360 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రాగా, 6 గేట్లు తెరిచి 26,680 క్యూసెక్కులను దిగువన వదిలారు. కేసీ కెనాల్‌కు 935 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.