మల్దకల్, మార్చి 22 : రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో చల్లని వ్యాపారాలు జోరందుకున్నాయి. వేసవి దాహం తీరేలా మట్టి కుండల వినియోగం పెరిగింది. పేదోడి ఫ్రిజ్‌గా పేరొందిన కుండలను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. సిద్ధంగా తయారు చేసిన ఈ కుండలు, కృత్రిమంగా తయారు చేసిన ఫ్రీజులు కంటే ఎంతో మం చివి. రూ.వేలు ఖర్చు చేసి ఫ్రీజులను కొనుక్కోలేని ప్రజలు చల్లని నీటితో వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు కుండలను వాడుతున్నారు.
ఇందులోని నీరు స్వచ్ఛమైనది కావడంతో పలువురు వీటిని వినియోగిస్తున్నారు. వీటికి కరెంట్‌తో పని లేదు.. ఒకవేళ పగిలిపోయినా మళ్లా కొనుక్కోవచ్చు. మార్కెట్లో ఒక్కో కుండ ధర రూ.50 నుంచి రూ.200 వరకు అందుబాటులో ఉన్నాయి. ఎండలో వచ్చిన వారు కుండలోని స్వచ్ఛమైన నీరు తాగితే ఎంతో ఉపశమనం పొ ందడం ఖాయం. గ్రామీణ ప్రాంతాల్లో కుండలను త యారు చేసి ప్రత్యేకంగా బట్టిల్లో కాల్చుతారు. అందు కే కుండలకు అంత డిమాండ్. పల్లెల్లో కుండల్లోనే పా లు, పెరుగును కాచి తోడు పెట్టడంతోపాటు మజ్జిగా చిలకడంతో రుచి వస్తుంది. వేసవిలోనే వీటి వినియోగం ఎక్కువ. అందుకే పెద్దమొత్తంలో కుమ్మరులు వీటిని రెడీ చేసి విక్రయిస్తుంటారు.