Head Constabel Injure | గొర్రెల దొంగలను పట్టుకునే యత్నంలో హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు
Head Constabel Injure | మేకలు, గొర్రెలు దొంగతనాలు చేస్తున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలైన ఘటన మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాగనూరు : మేకలు, గొర్రెలు దొంగతనాలు ( Sheep Thieves ) చేస్తున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో హెడ్ కానిస్టేబుల్ ( Head Constable ) కు గాయాలైన ఘటన మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలాల్లో జరుగుతున్న మేకలు, గొర్రెలు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు రాత్రి వేళలో గస్తీలు నిర్వహిస్తున్నారు.
గుడిగండ్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు తమ గొర్రెలను విక్రయించేందుకు రాయచూరు వైపు వెళ్తూ మార్గమధ్యలో మాగనూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ సమీపంలో విశాంత్రి తీసుకున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అక్కడ ఉన్న గొర్రెలను దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా అటుగా వచ్చిన పోలీసులను చూసి పారిపోయారు. పోలీసులు కారును వెంబడిస్తూ సమీప పోలీసులను అలర్ట్ చేశారు.
పోలీసులను చూసిన దొంగలు కారును వెనక్కి మళ్లించి పారిపోతుండగా పోలీసులు మాగనూరు పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును, లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు వేగంగా వచ్చి బస్సును బలంగా ఢీ కొంది. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ అర్జున్ దొంగను పట్టుకునే యత్నంలో దొంగ బలంగా నెట్టేసి పారిపోయాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ తలకు, కాలుకు, చేతికి బలంగా గాయాలు అయ్యాయని ఎస్సై అశోక్ బాబు తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం మొత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని వివరించారు. కారును స్వాధీనం చేసుకుని, కారులో ఉన్న కత్తి, స్క్రూ డ్రైవర్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్వు వివరించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

