మాగనూరు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల (HCU lands) వేలాన్ని తక్షణమే విరమించుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్ఎఫ్ఐ ( SFI ) నాయకులు నయిమ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరికి నిరసనగా విద్యార్థుల నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులను గురువారం మాగనూరు పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ అక్రమ నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలను బలోపేతం బదులు బలహీనపరిచే చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు.
యూనివర్సిటీ భూములను రక్షించాలని విద్యార్థులు ఉద్యమిస్తే వారిని పోలీస్ స్టేషన్లకు లాకెళ్లి నిర్బంధించడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సూర్య ప్రకాష్, అంబరీష్, తదితర నాయకులను అరెస్టు చేశారు.