కొల్లాపూర్, మే 8 : పండ్లల్లోనే రారాజు అయిన మామిడిని ఇష్టపడని వారుండరు. వేసవి వచ్చిందంటే చాలు మామిడిపండ్ల కోసం జనాలు ఎగబడుతారు. ఇందులో కొల్లాపూర్ మామిడి అంటేనే దేశ విదేశాల్లో ప్రత్యేకమైన గుర్తింపు, రుచికరమైన పం డ్లకు కొల్లాపూర్ జియో లాజికల్ గుర్తింపు పొం దింది. ఇదే అదునుగా భావించి కొందరు స్వార్థంతో కొల్లాపూర్‌తోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మామి డి పండ్లల్లో తియ్యటి విషం నింపుతున్నారు. ఒకప్పుడు సీజన్లో మాత్రమే అందుబాటులో ఉండే ఫలాలు నేడు సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కాయలు సైతం డిమాండ్‌ను బట్టి 12 గంటలల్లోనే పక్వానికి వచ్చేందుకు విషం నింపి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఆదాయం కోసం అక్రమ మార్గం..
మామిడిలో అధిక దిగుబడులు రావాలని సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి రైతులను కొందరు స్వార్థపరులు దూరం చేస్తున్నారు. కాల్షి యం కార్బెడ్ రసాయనాలు ఉగ్రవాదం కంటే ప్ర మాదమని కోర్టులు చెప్పినా మామిడి కాయల్లో విచ్చలవిడిగా వాడుతూ క్యాన్సర్ వ్యాధిని క్రమేనా పెంచుతున్నారు.
మామిడి తోటల్లో రసాయనాల వా డకానికి ప్రధాన కారణం మామిడి కాయలను కొనుగోలు చేసే దళారులని చెప్పవచ్చు. అక్రమ మార్గం లో నిషేధిత రసాయానాలను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పర్యావరణ నిపుణులు ఆరోపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 33,841,91 ఎకరాల్లో మామిడి తోటలు సాగవువుతున్నాయి. ఎకరా మామిడి తోటలో సగటున 2టన్నుల దిగుబడి వస్తోంది. దీనికి అనుగుణంగా కాల్షియం కార్బెట్ రసాయానాలు కూడా వందల కేజీల్లో అక్రమ మార్గంలో నిషేధిత రసాయనాలు చేరుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
కాల్షియం కార్బెడ్..
మామిడి కాయలు త్వరగా పక్వానికి తెచ్చేలా ప్ర భుత్వం నిషేధించిన కాల్షియం కార్బెడ్ను యధేచ్చ గా వాడుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ దళారులు ఇచ్చే కాసులపై పెట్టి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసే కేంద్రాల్లో మామిడి కాయల స్టోరేజీ కేంద్రాల్లో విచ్చలవిడిగా కాల్షియం కార్బెడ్, చైనా ఇథిలియాన్ రసాయనాలను వాడుతున్నారు.
ప్రూట్ కవర్లో ఇథిలియన్ రసాయనం..
మామిడికాయలను ఆకర్షించే కలర్ వచ్చేందుకు ప్రూట్ కవర్స్ వాడుతున్నారు. అయితే ఈ కవర్లలో చైనా ఇథిలియన్ రసాయనాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రూట్ కవర్లలో ఉన్న మామిడిపండ్లు సహజసిద్ధంగా ఉన్న మామిడి పండ్లల్లో రుచి తేడాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రూట్స్ కవర్‌పై తయారీ విషయంలో అధికారుల పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
12 గంటల్లోనే పండుగా..
చెట్టుపై ఉన్న కాయలు పండ్లుగా మారేందుకు రెండు నెలల సమయం పడుతుంది. కానీ దళారుల ఉచ్చులో పడిన మామిడి రైతులు తప్పని పరిస్థితు ల్లో మామిడి కాయలపై చుక్కలు ఏర్పడే కంటే ముం దే కోత కోసి విక్రయిస్తున్నారు. దళారులు మాత్రం మామిడి కాయలను సహజసిద్ధంగా మాగపెట్టకుం డా కాల్షియం కార్బెడ్తో మాగబెడుతున్నారు. దీంతో కేవలం 12 గంటలల్లో మామిడి కాయలు పండ్లుగా మారుతున్నాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయలను సహసిద్ధంగా మగపెడితే పండుగా మారేందుకు దాదాపు 5రోజుల సమయం పడుతుంది.
రసాయన పదార్థాలు తీసుకోవద్దు..
ప్రతి వేసవిలో అందరూ ఇష్టంగా తినే మామిడిపండ్లు కాలకుట విషంగా మారుతున్నాయి. మామిడి పండ్లుగా మార్చే క్రమంలో వా డే కాల్షియం కార్బె డ్ రసాయానలతో ప్రజ ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతోందని చెప్పవచ్చు. ప్రజలు వీలైనంత వరకు ఆరోగ్యానికి ముప్పు కలిగే రసాయ న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
– శ్రీనివాసులు, కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్,