జడ్చర్ల, జనవరి 1 : జడ్చర్ల నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజలు నూతన సంవత్సర వేడుకల ను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మధ్యరాత్రి 12గంటల తర్వాత కేక్‌కట్ చేసి 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం తెల్లవారు జామునే లేచి స్నానా లు ఆచరించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జడ్చర్ల మండల, మున్సిపాలిటీ ప్రజలు నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంటిముందు రంగురంగుల రంగవల్లులను పర్చి వాకిట్లను అందంగా అలంకరించారు. కొత్త సంవత్సరంలో అందరు బాగుండాలని ప్రతిఒక్కరూ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో ని 24వ వార్డులోని సంతోషిమాత ఆలయంలో కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మం డలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి, జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి, కన్యకాపరమేశ్వరీదేవి, అయ్యప్పస్వామి, సకలదేవతల ఆలయాల్లో భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో తన స్వగృహంలో సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డితో కలిసి కేక్‌కట్ చేశారు.
కృష్ణ, జనవరి 1 : మండల కేంద్రంతోపాటు గు డెబల్లూర్, మురహరిదొడ్డి, ముడుమాల, హిం దుపూర్ తదితర గ్రామాల్లో సోమవారం నూతన సం వత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), జనవరి 1 : నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ గ్రామ శివారు కందూరు స్టేజీ వద్ద ఉన్న సాయిబాబా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భ క్తులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్పవృక్షాల నీడలో బుజించి అక్కడే సేద తీరారు. ఆల య సన్నిధిలో మహబూబ్‌నగర్ డీఎస్పీ మహేశ్ రా మలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి, భక్తుల కు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయాల కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
భూత్పూర్, జనవరి 1 : నూతన(2024) సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, అమిస్తాపూర్‌లోని శ్రీసాక్షిగణపతి ఆలయంలో, శిర్డీసాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మాజీ సర్పంచ్ సత్తూ ర్ నారాయణగౌడ్, మాజీ ఎంపీపీలు చంద్రమౌళి, చంద్రశేఖర్‌గౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
మూసాపేట, జనవరి 1 : నూతన సంవత్సర సం దర్భంగా మూసాపేట మండల కేంద్రంలోని రామలిస్వామి గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగానికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పోల్కంపల్లి శారద చంద్రమౌళీశ్వర స్వామికి భక్తులు అభిషేకాలు, అర్చనలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అనితా, శ్రీకాంత్‌రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, జనవరి 1 : మండలంలోని జాజాపూర్, కొల్లంపల్లి, సింగారం, కోటకొండ , అప్పక్‌పల్లి, అప్పిరెడ్డిపల్లి, అంత్వార్, బైరంకొండతోపాటు వివిధ గ్రామాల్లో సోమవారం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి కేక్ కట్ చేసి డ్యాన్స్‌లు చే శారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
మరికల్, జనవరి 1 : మరికల్, ధన్వాడ మండలాల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి యువత నూతన సంవత్సరానికి స్వాగతం పలికా రు. సోమవారం ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూ జలు, చర్చీల్లో ప్రార్థనలు చేశారు.
నారాయణపేట, జనవరి 1 : శాంతి భద్రతల ప రిరక్షణలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ నాగేంద్రుడు అన్నారు. సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప ట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ శేఖర్‌బాబు, లలిత పాల్గొన్నారు.
నర్వ, జనవరి 1 : మండలంలో పలువురు ప్ర జాప్రతినిధులు, అధికారులు నూతన సంవత్సర శు భాకాంక్షలు ప్రజలకు తెలిపారు. ఎంపీపీ జయరాములు శెట్టి, జెడ్పీటీసీ జ్యోతికిరణ్, ప్రకాశ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వీణావతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ హేశ్వర్‌రెడ్డి కేక్‌కట్ చేశారు. ఎస్సై కురుమ య్య పోలీస్‌స్టేషన్‌లో కేక్‌కట్ చేసి సిబ్బంది పంచిపెట్టారు.
నవాబ్‌పేట, జనవరి 1 : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో 2024 నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం రాత్రి ఆయా గ్రామాల్లో యువకులు కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. సోమవారం గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ఫతేపూర్ మైసమ్మ ఆలయం, గురుకుంట సాయిబాబ ఆలయం, నవాబ్‌పేట పెద్ద శివాలయంలో భక్తులు పూజలు చేపట్టారు.