మహబూబ్‌నగర్, నవంబర్ 22 : సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందని దుస్థితి నెలకొన్నదని బాధిత కుటుం బ సభ్యులు ఆరోపించారు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన చేగువీర (11) అనే గురుకులం విద్యార్ధి జ డ్చర్ల సమీపంలోని పోచమ్మగడ్డతండా వద్ద ఉన్న బాలానగర్ గురుకులంలో చదువుతున్నాడు. ఆ బా లుడు ఈ నెల 12వ తేదీన ఇంటికి వెళ్లాడు. ఈ క్ర మంలో ఆ విద్యార్థి అనారోగ్యానికి గురైతే అప్పటి నుంచి దవాఖానలో వైద్యసేవలు పొందుతున్నాడు. తీవ్ర జ్వరంతో ఉండడంతో వనపర్తి జనరల్ దవాఖానకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు జ్వరం ఉందని వైద్యసేవలు అందించారు. తీరా జ్వరం తగ్గకపోవడంతో ప్రైవేట్ దవాఖానలో ఎక్స్‌రే తీపించుకుని వస్తే ఊపిరితిత్తులతో న్యూ మోనియా ఉన్నట్లు వైద్యులు ఆలస్యంగా గుర్తించా రు. వెంటనే నిలోఫర్ దవాఖానకు తరలించకుం డా శుక్రవారం ఉదయం వనపర్తి జనరల్ దవాఖాన నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించగా ఇక్కడ పరీక్షించిన వైద్యులు న్యూ మోనియా ఉందని, బీపీ పల్స్ పడిపోతున్నాయని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక్కడ సరైన వైద్య సేవలు అందుబాటులో లేవని హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో అన్ని వసతులు ఉంటాయని చెప్పి అంబులెన్స్‌లో తరలించారు.
అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రభు త్వ మెడికల్ కళాశాలలకు అనుసంధానంగా ఉన్న ప్రభు త్వ జనరల్ దవాఖానలో అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని వచ్చిన కుటుంబానికి సరైన వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు సమయం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సా యంత్రం అంబులెన్స్‌లో నీలోఫర్ దవాఖానకు తరలించారు. అయి తే ఇంత ఆలస్యంగా ఎందుకు తీసు కువచ్చారని ముందే తీసుకవచ్చుంటే ప్రాణాలు కాపాడే వాళ్లమని చేతులెత్తేయడంతో శనివారం తెల్లవారు జాము న విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అనారోగ్యానికి గురైన తమ కుమారుడి వైద్య సేవల కోసం 16 గంటల పాటు మూడు దవాఖానల చు ట్టూ తిరిగినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు.
ముందుగా వనపర్తి జనరల్ దవాఖాన నుంచి మహబూబ్‌నగర్ జనరల్ దవాఖాన చుట్టూ తిరిగిన సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని మెరుగైన వైద్యసేవల కోసం హైదరాబాద్ నిలోఫర్ దవాఖానకు రెఫర్ చేశారని, అక్కడకు వెళితే ఆల స్యం చేశారు మేం ఏం చేయలేరని చేతులెత్తేడంతో మా కుమారుడు చికిత్స పొం దుతూ మృతి చెందాడని, మా కుమారుడికి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.