గురు వైభవోత్సవాలకు వేళాయె
తుంగభద్ర నదీతీరాన వెలిసిన విశ్వగురువు ప్రహ్లాదరాయ స్వరూపులు రాఘవేంద్రస్వామి సశరీర బృందావనులై భువనమోహనుడిగా వెలుగొందుతున్నారు. తుంగభద్రానది ఒడ్డున వెలిసిన రాఘవేంద్రుడు భక్తి పరిమళాలను విరబూయిస్తున్నారు
- నేటి నుంచి రాఘవేంద్రస్వామి ఉత్సవాలు
- 21న పట్టాభిషేకం, 26న జయంత్యుత్సవం
- మంత్రాలయంలో ఏర్పాట్లు పూర్తి చేసిన
- శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు
మంత్రాలయం, ఫిబ్రవరి 20: తుంగభద్ర నదీతీరాన వెలిసిన విశ్వగురువు ప్రహ్లాదరాయ స్వరూపులు రాఘవేంద్రస్వామి సశరీర బృందావనులై భువనమోహనుడిగా వెలుగొందుతున్నారు. తుంగభద్రానది ఒడ్డున వెలిసిన రాఘవేంద్రుడు భక్తి పరిమళాలను విరబూయిస్తున్నారు. సద్గురు రాఘవేంద్ర జయంతి, పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని గురు వైభవోత్సవాలు మంగళవారం నుంచి 26వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో ఆరు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు.
బుధవారం రాఘవేంద్రస్వామి 402వ పట్టాభిషేక మహోత్సవం చేపట్టనున్నారు. ఉత్సవంలో భాగంగా రాఘవేంద్రస్వామి స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకం చేయనున్నారు. 21నుంచి 26వరకు రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 26న రాఘవేంద్రస్వామి 428వ జయంతి ఉత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. గురు వైభవోత్సవాలను పురస్కరించుకుని రాఘవేంద్రస్వామి పూర్వావతారమైన ప్రహ్లాదరాయలు వివిధ రకాల రథోత్సవాలపై ఆశీనులై భక్తులను కటాక్షించనున్నారు. గురు వైభవోత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల మంత్రులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, ప్రముఖులు విచ్చేయనున్నారు. ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు శ్రీమఠం పీఠాధిపతి సుధేంద్ర తీర్థులు తెలిపారు. గురు వైభోత్సవాలకు చక్కటి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి పేర్కొన్నారు. వైభోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి చూసి తరించాలని కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

