కొత్తకోట : మండలంలోని కానాయపల్లి స్టేజీ వద్ద ఉన్న సుప్రసిద్ధమైన శైవక్షేత్రం కోటిలింగేశ్వర దత్తదేవస్థానములో ( Datta Temple ) గురువారం గురుపౌర్ణమి ( Gurupournami) వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ఉన్న శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తత్రేయ స్వామికి పంచామృతాలతో , భస్మ గంధం, కుంకుమ జలాలతో అభిషేకం వైభవంగా జరిపించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో మహామంగళహారతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకొని గురుదత్తాత్రేయస్వామి అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఆలయకమిటీ అన్నదానం చేశారు.