నాగర్‌కర్నూల్, ఆగస్టు 18 : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. పాపన్నగౌడ్ జయంతి వేడుకలను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాత మార్కెట్ యార్డు ఆవరణలో ని పాపన్నగౌడ్ విగ్రహానికి మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు, పలువురు గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని, అలాంటి యోధుడి జయంతి వేడుకలు నాగర్‌కర్నూల్ పట్టణంలోని గౌడ కులస్తుల మధ్య నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అణగారిన వర్గాలకు అం డగా నిలిచి, పేదల హక్కులకోసం ధైర్యంగా పోరాడిన పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
పాపన్న చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవ భావనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో పాపన్న గౌడ్ పారాటానికి ప్రత్యేకమైన స్ధానం ఉందని, ఆయన సేవలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంతకుముందు గౌడ కులస్తులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్నిపల్ చైర్మన్ కల్పనభాస్కర్గౌడ్, వేణుగోపాల్‌గౌడ్, బాలగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, కిశోర్‌గౌడ్, కేశవులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.