వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామపంచాయతీ గొల్లోనిపల్లి గ్రామం నుంచి మర్రిగుంత తండా వరకు బీటీ రోడ్డు ( BT Roads ) నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ( MLA Kasireddy Narayana Reddy) పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2. 50 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. అన్ని గిరిజన తండాలకు( Tribals Thandas) బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని , ప్రభుత్వం తండాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ జయప్రకాష్, జంగయ్య యాదవ్, రషీద్, పుల్లయ్య, హరికిషన్, గోపాల్ రెడ్డి, చందు నాయక్, శివరాజ్ గౌడ్, చందర్ తదితరులు ఉన్నారు.