గొర్రెల, మేకల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ బాలరాజ్ యాదవ్
నారాయణపేట రూరల్, జూన్ 8 : రాష్ట్రంలోని గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గొర్రెల, మేకల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలరాజ్ యాదవ్ మాట్లాడుతూ రా ష్ట్రంలోని 7,61,869 మందిని గుర్తించి రూ. 12 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేయనున్న ట్లు తెలిపారు. ఇప్పటివరకు మూడు లక్షల పైచిలుకు లబ్ధిదారులకు రూ.5వేల కోట్లతో పంపిణీ చేశామన్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆరు రకాల మందులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీ సుకెళ్తున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి అండగా ని లబడాలన్నారు.
అభివృద్ధి రుచిని చూపిస్తున్న సీఎం కేసీఆర్‌కు అందరూ మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రా జేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2,30,000 గొర్రెలను పంపిణీ చేశామని, రెండో విడుతలో కూడా డీడీలు కట్టిన అందరికీ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖాధికారిణి సురేఖ, జెడ్పీటీసీ అంజలి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజొద్దీన్, సర్పంచ్ త్రివిక్రమరావు, ఉప సర్పంచ్ నర్సింహులు, ఎంపీటీసీ బాలమణి, వైద్యులు రాఘవేందర్ గౌడ్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.