గంజాయి సాగు చేస్తే రైతుబంధు కట్.. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ఒకరు.. తాజాగా గద్వాలలో ఇద్దరిపై కేసులు
నిర్వహించిన అధికారులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా గుట్టు చప్పుడు
మహహబూబ్‌నగర్: గంజాయి పూర్తి స్థాయి నిర్మూలనకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గంజాయి సాగు చేసే వారిపై ప్రభుత్వం అన్ని విధాలా కట్టడి ప్రారంభమైంది. గ్రామాల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేయకుండా ఉండేందుకు అవగాహన సదస్సులు నిర్వహించిన అధికారులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న ఓ రైతుకు రాష్ట్రంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈ నెల 5న జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్‌నగర్ తర్వాత సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ క్రాంతి ఆదేశాల మేరకు గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన ఇద్దరు రైతులకు రైతుబంధు నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

గత ఏడాది అక్టోబర్ 28న, జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంటకు చెందిన ఎం.అంబస్వామి, ఎం.సిద్ధయ్యకు అయిజ మండలం దేవబండ గ్రామంలో ఉన్న 8 ఎకరాల పొలాన్ని బి.రామాంజనేయులు, పెద్ద రాముడు అనే వ్యక్తులు కౌలుకు తీసుకున్నారు. ఆ తర్వాత మిరపపంట సాగు మాటున గంజాయి సాగు చేశారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడ దాడులు చేశారు. రెండు చోట్ల 43 గంజాయి మొక్కలను గుర్తించారు. శాంపిల్స్ తీసుకుని వాటిని అక్కడే ధ్వంసం చేశారు. కౌలుకు ఇచ్చిన ఇద్దరి పైనా, గంజాయి సాగు చేస్తున్న వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. గంజాయి సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు నిలుపదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతులకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై రైతుబంధును నిలిపివేస్తూ జిల్లా ఇంచార్జి వ్యవసాయాధికారి ఎం.సక్రియా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

