కల్వకుర్తి, మార్చి 31: ఊర్కొండ పేట రేప్ ఘ టన మహిళలకు రక్షణ కరువైందనే వాదనలకు ఉతమిస్తున్నది. నిర్భయ, దిశలాంటి కఠినమైన చ ట్టాలు ఎన్ని తీసుకొస్తున్నా.. మహిళలపై ఏదోఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆభయాంజనేయ స్వామి ఆలయం అంటే ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ప్రసిద్ధి. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. శనివారం రాత్రి అభయాంజనేయుడి స న్నిధిలో భజనలు జోరుగా సాగుతాయి. ఎంతోమంది భక్తులు తెల్లవార్లు భజనలో పాల్గొంటా రు.
ఇలాంటి ఆలయానికి వచ్చే భక్తులకు సామూహిక లైంగికదాడి ఘటన భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఆలయానికి సమీపంలో గట్టిగా కూతవేస్తే వినిపించే దూరంలో బహిర్భూమికి వచ్చిన మహిళపై 8మంది సామూహికంగా లైంగిక దాడికి పాల్పడడం చూస్తుంటే ఆలయం వద్ద భద్రతను గాలికొదిలేసినట్లే కనిపిస్తున్నది. ఆలయానికి మూ డు కిలోమీటర్ల దూరంలో పోలీస్‌స్టేషన్ ఉందన్న భ యం కూడా లేకుండా కామంతో కల్లు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచి బరితెగింపుతో మ హిళపై లైంగిక దాడికి ఒడిగట్టడం చూస్తుంటే.. ఇం కా ఎలాంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తే.. ఇలాం టి ఘటనలకు బ్రేక్ పడుతుంది.
గుడిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి ఒకరు ఈ దుస్సంఘటనకు కేంద్ర బిందువయ్యాడని.. గుడికి వచ్చిన మహిళను ఆదినుంచి గమనించా డు. మహిళ రాత్రివేళ గుడి బయటకు వ్యక్తిగత అ వసరాలకు వెళితే.. స్నేహితులకు సమాచారాన్ని చేరవేశాడు. మహిళను కాపుగాసి పట్టుకున్న స్నేహితులు సామూహికంగా లైంగికదాడి చేశారు. నేర ప్రవృత్తి కలిగిన తాత్కాలిక ఉద్యోగి ఆలయంలో ఎలా పనిచేస్తేన్నాడనేది మరో ప్రశ్న. శనివారం ఆ లయం వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలామంది మహిళా భక్తులు అక్కడే నిద్ర చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అ క్కడ ఎందు కు గస్తీ కాయడంలేదనే మరో ప్రశ్న వినిపిస్తుంది.
పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి
వివాహితపై అత్యాచార ఘటనపై పూర్తిస్థాయి లో విచారణ జరపాలని మానవతా వాదులు డి మాండ్ చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడింది 8లేదా 9మంది అని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశా రు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయం వద్ద పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలని, నైతిక విలువలు కలిగిన వారిని ఆలయంలో ఉద్యోగులుగా నియమించుకోవాలని కోరుతున్నారు.
బహిరంగ మద్యపానమే కారణం
బహిరంగ ప్రదేశాల్లో, ఖాళీ ప్లాట్లలో మద్యం సేవిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలపై రాబడిని చూ స్తుంది. ఊర్కొండపేట ఘటనలో కూడా జరిగింది అదే. ఆలయానికి అతి సమీపంలో యువకులు మద్యం సేవిస్తున్నారు. వివాహిత అటువైపే వస్తుందనే సమాచారంతో మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు లైంగిక దాడికి తెగబడ్డారు. శాంతిభద్రతల విషయంలో ప్రభు త్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలో మహిళలపై దౌర్జాన్యాలు పెరిగిపోతున్నాయని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.