గద్వాల మున్సిపాలిటీ పరిధిలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.. ఎక్కడ చూ సినా కబ్జాల పర్వం కొనసాగుతున్నది.. ఖాళీ స్థ లాలు కనిపిస్తే కబ్జాదారులు వాలిపోతున్నారు.. ఆఖరుకు మురు గు కాల్వలు సైతం వదలడం లేదంటే కబ్జా ఏ తీరుగా సాగుతుందో అర్థమవుతున్నది.. ఇక అక్రమ వెంచర్లకు హద్దే లేదని చె ప్పాలి.. కబ్జాదారులకు ఇంత ధైర్యం ఎలా వ చ్చిందని ఆలోచిస్తున్నారా.. ఇందులో ఆలోచించాల్సింది ఏముంది..? మనకు తెలిసేందే.. సం బంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి.. రాజకీయ నాయకుల అండదండలు.. ఉన్నతాధికారుల పట్టింపులేని తనం.. వెరసి పట్టణంలో విలువైన స్థలాలు కబ్జాలపాలవుతున్నాయి.. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రమాదం తప్పదంటూ ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు.
-గద్వాల టౌన్, జనవరి 15
గద్వాల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు.. కబ్జాలకు.. నిబంధనలకు వ్యతిరేకంగా వెం చర్లు వేయడం.. గృహనిర్మాణ అనుతులతో బహుల అంతస్తుల నిర్మాణాలకు అంతేలేకుండా పోతున్నది. వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రహరీకి ఆనుకొని ఉన్న 20 ఫీట్ల డ్రైనేజీని మున్సిపల్ ప్రమేయం లేకుండానే కూల్చివేశారు. పాత డ్రైనేజీ స్థానంలో కొత్త డ్రైనేజీని నిర్మించి ఇస్తామని నమ్మబలికి ఆ ముసుగులో 10 ఫీట్ల స్థలాన్ని కమీషన్ దారులు వారి ఖాతాలో వేసుకున్నారు. ఇండోర్ స్టేడియం, పాలకేంద్రం మధ్య ఉన్న దాదాపు అర ఎకర పొలాన్ని కబ్జా చేసేందుకు ఓ వర్గం యత్నించింది.
ఇందుకు సంబంధిత అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపైకే దాడికి యత్నించారు. గాంధీచౌక్ నుంచి గంజిపేటకు వెళ్లే మార్గంలో ఉన్న కందకంపై ఎన్నో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఏకంగా కందకాన్ని పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అలాగే బాలస్వామి డబ్బా ముందు ఉన్న కందకం పూర్తిగా కనుమరుగైంది. కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర, థియేటర్ల ముందు ఉన్న 30 ఫీట్ల కందకం మూడు ఫీట్లకు కుదించుకుపోయింది. రెండు లారీలు అటు ఇటు రాకపోకలు సాగించే వడ్డేవీధిలో ఆటో కూడా వెళ్ల్లలేని పరిస్థితి నెలకొన్నది. ఇలా చెప్పుకుంటే పోతే.. ఎన్నో అక్రమ నిర్మాణాలు, కబ్జాలతో పట్టణం రోజురోజుకు కుంచించుకుపోతున్నది.
అక్రమ వెంచర్లు ఏర్పాటు..
గద్వాల సమీపంలో అక్రమ వెంచర్లకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. రీక్రియేషన్ జోన్లో ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన చేయించుకొని వెంచర్లు వేశారు. మాస్టర్ ప్లాన్‌లో రీక్రియేషన్ జోన్ కింద రిజర్వు చేసిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అలాగే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రీక్రియేషన్ జోన్లో ఉన్న భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారం అధికారులకు లేదు. అయినా కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆ భూముల్లో రూ. కోట్లల్లో వ్యాపారాలు సాగినట్లు తెలిసింది. ఇవేవీ తెలియక కొనుగోలు దారులు పూర్తిగా మోసపోతున్నారు.
ఇష్టానుసారంగా నిర్మాణాలు..
పట్టణంలో కొందరు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు మాత్రం తమకెందుకులే మూడు నెలలు ఇక్కడ ఉండి మరోచోటుకు పోయేటోల్లం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. నిర్మాణ సమయంలో గృహం కోసం దరఖాస్తు చేసుకొని అనుమతి వచ్చిన తరువాత షాపింగ్ కాంప్లెక్స్, బ్లంకెట్హాల్స్, మాల్స్ నిర్మిస్తున్నారు. కనీసం నిబందనలు కూడా పాటించడం లేదు. కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం లేదు.
అధికారులు పర్యటించినా చర్యలు శూన్యం..
భీంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌తోపాటు కృష్ణవేణి చౌరస్తాలోని ఓ మాల్ నిర్మాణాలకు జారీ చేసిన ఓసీ సర్టిఫికెట్ జారీ పై అభ్యంతరాలు చెబు తూ గత కమీషనర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే సుంకులమ్మ మెట్టులో నిర్మాణం చేస్తున్న కట్టడంపై ఏకంగా సీఎం ప్రజావాణిలో కొందరు ఫిర్యాదు చే శారు. గంజిపేటలో ఏర్పాటు చేసిన వెంచర్‌పై, జమ్మిచేడు దగ్గర ఉన్న ఓ లే అవుట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అనుమతులు ఇ చ్చారని, అదే శివారులో చేపడుతు న్న భవన నిర్మాణాం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు ప్రణాళిక విభాగం ఏడీ స త్యభామ గత ఏడాది డిసెంబర్ 2న గద్వాల మున్సిపాలిటీని సందర్శించారు. ఫిర్యాదులు వచ్చిన వాటిని పరిశీలించి వెళ్లారు. అయినా ఇంతవరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి మరి. అయితే కబ్జాల విషయంపై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించినా ఫోన్ లిఫ్టు చేయడం లేదు.