జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణం పిల్లిగుండ్ల కాలనీలో పూరిగుడిసె దగ్ధం కావడంతో ఓ కుటుంబం రోడ్డున పడింది. బాధితుడు బుడగ జంగాల గోపాల్ ఇంట్లో నిల్వ ఉన్న రూ.3 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలతో పాటు, ఇంటి పత్రాలు, కుమారుడి స్టడీ సర్టిఫికెట్స్ పత్రాలు మంటలో బూడిద అయ్యాయి.
కష్టపడి కట్టుకున్న పూరి గుడిసెతో పాటునగలు, నగదు, మంటల్లో కాలి పోవడంతో జీవితం అగ్యమ్యాగొచరంగా మారిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అయన వేడుకొన్నారు.