న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్ష (సీయూఈటీ) నిర్వహించాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. ఉన్నత విద్యపై కేంద్రం పెత్తనం చెలాయించేందుకే ఈ పరీక్ష నిర్వహించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇదో తిరోగమన చర్య అని పేర్కొన్నారు.