గద్వాల: ఈ నెల 20న జూరాల ప్రాజెక్టు మీద ఓ కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు నదిలో పడి మృతి చెందాడు. మృతదేహాం కోసం ధరూర్ ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో జాలర్ల సాయంతో పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు.
బుధవారం ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ శివారులో గల కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహాం చేపల వేటకు వెళ్లిన జాలర్లకు కనిపించడంతో ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. మహేష్ మృతదేహంగా గుర్తించినట్లు సమాచారం.