
మహ్మదాబాద్/గండీడ్, జూలై 30 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో శుక్రవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో డీసీసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుమ యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఉమ్మడి గండీడ్ మండలంలో మొదటి విడుత 1300 యూనిట్ల గొర్రె లు పంపిణీ చేయగా, రెండోవిడుత 1390 యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు.
ప్రణవ్‌కుమార్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
భారత నౌకాదళంలో ఉన్నత ఉద్యోగం సాధించిన ప్రణవ్‌కుమార్‌రెడ్డిని ప్రతి విద్యార్థీ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి సూచించారు.
దేశాయిపల్లిలో సర్పంచ్ రాఘవేందర్ ఆధ్వర్యంలో ప్రణవ్‌కుమార్‌రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు.
పప్పుమిల్లు నిర్మాణానికి భూమిపూజ
గండీడ్ మండలకేంద్రంలో రూర్బన్ పథకం చేపట్టిన పప్పుమిల్లు నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూర్బన్ పథకం నుంచి మంజూరైన రూ.కోటీ 25లక్షలతో పప్పుమిల్లు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఏటీఎం సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, సర్పంచులు చంద్రకళ, రాఘవేందర్, కోఆప్షన్ సభ్యుడు సలీం, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, డైరెక్టర్ వెంకటయ్య, నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, అశోక్‌గౌడ్, తిర్మల్‌రెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, వెంకటయ్య, గోపాల్, బిక్షపతి, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.