ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, మార్చి 7: సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి సోమవారం అ సెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్, జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరుపై క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్లో గట్టు ఎత్తిపోతల పథకానికి రూ.700కోట్లు మంజూరు చే స్తున్నట్లు ప్రకటించడంతో గట్టు ప్రజల చిరకాలవాంచ త్వరలో నెరవేరుతుందని చెప్పారు. గద్వా ల ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. మంగళవారం వనపర్తిలో జరిగే సీఎం స భకు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలను తరలిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, సర్పంచ్ బండ్ల జ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ రావడంపై హర్షం
గద్వాల అర్బన్, మార్చి 7: జిల్లాకు మెడికల్ కాలేజీ రావడంపై ప్రజా, విద్యార్థి, అఖిలపక్ష, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలనే చిరకాలవాంఛ నెరవేరిందన్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మల్దకల్, మార్చి 7: జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటిండంపై ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి తదితరులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.