లబ్ధిదారులతో టీఆర్ఎస్ నేతల సెల్ఫీ
మహిళలను సన్మానించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు
నేడు మహిళా దినోత్సవం
నెట్వర్క్, నమస్తే తెలంగాణ ;‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు ఉత్సాహంగా జరుపుకొంటున్నారు.ఊరూరా వేడుకలు అంబురాన్నంటాయి.సోమవారం టీఆర్ఎస్ నేతలు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. పలువురు ప్రముఖులు మహిళలు, ఆశలు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులను సన్మానించారు. తిమ్మాజిపేటలో
చీరలు, గాజులు పంపిణీ చేశారు. గద్వాలలో మిస్ ఆసియా రష్మీ ఠాకూర్ హాజరై 2కే రన్‌ను ప్రారంభించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం మహిళాబంధు సంబురాలను పండుగలా జరుపుకొన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని హరిజనవాడ కమ్యూనిటీహాల్లో కౌన్సిలర్లు సుంకసారి రమేశ్, శ్రీశైలమ్మ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక అంగన్వాడీ, వైద్యసిబ్బందిని ఘనంగా సన్మానించారు. అలాగే బూరెడ్డిపల్లిలో కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేసి సెల్ఫీ దిగారు. శాంతినగర్‌కాలనీలో కౌన్సిలర్ చైతన్యగౌడ్ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ జయప్రద, మాజీ ఎంపీపీ లక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్లు కాట్రపల్లి లక్ష్మయ్య, పీ.మురళి వైద్యసిబ్బందితోపాటు కాలనీ మహిళలను సన్మానించారు. లక్ష్మీనగర్‌కాలనీలో కౌన్సిలర్ లత ఆధ్వర్యంలో, 9వ వార్డు విజయనగర్‌కాలనీలో కౌన్సిలర్ చైతన్యాచౌహాన్ ఆధ్వర్యంలో మహిళా సిబ్బందిని సన్మానించి సం బురాలను నిర్వహించారు. అలాగే నక్కలబండతండా, శంకరాయపల్లితండాకు చెంది న కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను జడ్చర్ల జా తీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ గాయత్రి, బాద్మి వీణాశివకుమార్, నర్తకి, బింధు మాధవి, జమీలాబేగం, విజయల క్ష్మి, బాలమణి, అఖిల, అనూష, గోవర్ధని, యశోద, కళావతీమాతాజీని సన్మానించా రు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మహిళా సా ధికారత విభాగం ఆధ్వర్యంలో మహిళా ది నోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అప్పీయచిన్నమ్మ అధ్యాపకులను సన్మానించారు.
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి
నవాబ్‌పేట, మార్చి 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించారని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి అన్నారు. మహిళాబంధు సంబురాల్లో భాగంగా మం డల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లు, వివిధ శాఖల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సిం గిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, ఎంపీడీవో శ్రీలత, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, స ర్పంచులు గోపాల్‌గౌడ్, యాదయ్యయాద వ్, కారూర్ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ రాధాకృ ష్ణ, నాయకులు అబ్దుల్‌అలీ, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణగౌడ్, శశిధర్‌రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.
అన్నిరంగాల్లో రాణించాలి
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 7 : మ హిళలు అన్నిరంగాల్లో రాణించాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. మున్సిపల్ సమావేశ మందిరంలో మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్ అనంతరెడ్డి పాల్గొన్నారు. అలాగే వీరన్నపేటలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు జ్యోతీశివరాజ్ మున్సిపల్, వై ద్యసిబ్బందిని సన్మానించారు. అలాగే ప్రభు త్వ దవాఖానలో కాన్పు చేయించుకున్న మహిళకు కేసీఆర్ కిట్ అందజేశారు.
అతివల అభివృద్ధే ధ్యేయం
కోయిలకొండ, మార్చి 7 : అతివల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ శశికళ అన్నారు. కోయిలకొండ ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళాబంధు సం బురాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య ఎంపీటీసీలు రోజా, విజయలక్ష్మి, మహిళా సంఘం స భ్యురాలు పద్మ, ఏపీఎం సునీత, సీసీలు మ ల్లేశ్, భద్రూనాయక్, కేశవులు, నరేశ్, కవిత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలతో భరోసా
గండీడ్, మార్చి 7 : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ భరోసా నింపిందని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెన్నాచేడ్‌లో ప్రభుత్వ పథకాలపై అవగాహన క ల్పించారు. కల్యాణలక్ష్మి పథకంతో ఆడపిల్ల ల పెండ్లికి ప్రభుత్వం రూ.లక్షా116 అం దించి అండగా నిలుస్తున్నదన్నారు. అలాగే ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నదని తెలిపారు. మహిళా సంఘాల స భ్యులకు అధిక మొత్తంలో రుణాలు అం దించి చేయూతనిస్తున్నదని వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రేణుక, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి, గ్రామాధ్యక్షుడు మాణిక్యం, రాంరెడ్డి, మల్లికార్జున్, దశరథ్, వెంకట్‌రెడ్డి, లక్ష్మ య్య, దస్తయ్య, మల్లేశ్ పాల్గొన్నారు.
మహిళలకు ప్రత్యేక గుర్తింపు
దేవరకద్ర రూరల్, మార్చి 7 : తెలంగాణ వచ్చాక మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ అన్నారు. మండలంలోని ఇస్రంపల్లిలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరాజు ఆధ్వర్యంలో మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భం గా ఎంపీపీ, జెడ్పీటీసీతోపాటు మహిళా ఉ ద్యోగులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, ఐసీడీఎస్ అధికారులు శైలశ్రీ, ప్రసన్న, కా ర్యదర్శి సింధు, వైస్‌ఎంపీపీ సుజాత, మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ కొండా సుగుణ, సర్పంచులు స్వప్న, రజిత, మాధవి, జ్యోతి, సబిత, శ్రీనివాస్, స్వామి పాల్గొన్నారు.
ఉద్యోగులకు సన్మానం
మహ్మదాబాద్, మార్చి 7 : మహిళాబంధు సంబురాల్లో భాగంగా మండలంలో ని నంచర్లలో మహిళా ఉద్యోగులను ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని సూ చించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు భిక్షపతి, గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, తిర్మల్‌రెడ్డి, కిష్టయ్య ఉన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మార్చి 7 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుశీల,ఎంపీడీవో లక్ష్మీదేవి, మహిళా సిబ్బందిని పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎం పీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, ఏపీఎం వెంకటాచారి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భీమమ్మ పాల్గొన్నారు.