మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 7 : కొల్లాపూర్ కోర్టు ఆవరణలో న్యాయవాదిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్ ప్రధాన కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాది పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి యోగేశ్వర్రాజ్యాదవ్, కార్యదర్శి లక్ష్మారెడ్డి, బ్రహ్మయ్య, సాహితీరె డ్డి, ఖాజామైనొద్దీన్, నర్సింహులు, రమేశ్, వెంకటేశ్, మల్లారెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.
జడ్చర్ల కోర్టులో..
జడ్చర్లటౌన్, మార్చి 7 : కొల్లాపూర్ కోర్టు ఆవరణలో న్యాయవాది సంతోష్‌కుమార్‌పై దుండగు ల దాడిని నిరసిస్తూ సోమవారం జడ్చర్ల కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదిపై దా డికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చే యాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యా యవాదులు మాలిక్‌షాకీర్, భగవంత్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మురళికృష్ణారావు, విశ్వేశ్వర్, యాదిరెడ్డి, ఇఫ్తెకార్, రాపోతుల శ్రీనివాస్‌గౌడ్, రమేశ్, ప్ర శాంత్ తదితరులు పాల్గొన్నారు.