సంక్షేమంలో, ఆర్థికవృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్
కేంద్రం కార్పొరేట్ శక్తులకు దాసోహం
రాష్ర్టాల హక్కులను హరిస్తున్న కేంద్రం
సీఎం సభను విజయవంతం చేయాలి
మూడేండ్ల తర్వాత సీఎం రాకకోసం ఆత్రుతతో ప్రజలు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు కలుగుతుంద ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి క్యాంపు కార్యాలయంలో ఎంపీ రాములుతో కలిసి మంత్రి మీ డియా సమావేశంలో మాట్లాడారు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేసినందువల్లే అభివృద్ధి సా ధ్యమైందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరి గి ప్రజలకు పథకాలు నేరుగా అందుతున్నాయన్నారు. ‘ధరణి’తో భూ వివాదాలు లేకుండా.. సామాన్యుడు కూడా ధైర్యంగా సేవలు పొందే వీలు కల్పించారన్నారు. వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు ముందు కు వెళ్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్ర జలు, అమరుల ఆకాంక్ష మేరకు ఒక్కొక్క స మస్యను పరిష్కరిస్తున్నదన్నారు. నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నదన్నారు. దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని చెప్పారు. మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. సృష్టికి మూ లం మహిళ అని, వారి సృజనకు, ఎదుగుదల కు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. వారిని గౌరవించుకున్న సమాజం ఉన్నతంగా ఉంటుందన్నారు. మహిళలపై మన ఆలోచనా విధానం మారాలన్నారు. వారి భాగస్వామ్యం లేని చో ట వివాదాలుంటాయన్నారు. మూడేండ్ల త ర్వాత సీఎం వస్తున్నారని, ప్రజలు ఆయన రా క కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని, పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు.
కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నదని విమర్శించా రు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం తిరోగమనం వైపు తీసుకెళ్తున్నదన్నారు. ప్రజల ఆస్తులను అమ్ము తూ కార్పొరేట్ శక్తులకు దాసోహమవుతూ ఆ స్తులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రూ. 6 లక్షల కోట్లు ఎగవేసిన వారికి పెద్దపీట వేస్తు న్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. రాష్ర్టాల హక్కులను కేంద్రం హరిస్తున్నదన్నారు. కేంద్రం పోకడలు ప్రజల కు మేలు చేయవన్నారు. ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలు తీసుకొని ఎదురులేని శక్తినని ప్రకటించిన ఇందిరాగాంధీని ప్రజలు ఓడించారని తెలిపారు. ప్రజలే అంతిమ విజేతలన్నారు. పీఎం మోడీ చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారని.. ఇటువంటి వారిని ప్రజలు తరమికొడతారన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ వనపర్తిలో నిర్వహించే సీఎం బహిరంగ సభ నభూతో న భవిష్యత్‌లా ఉంటుందన్నారు. ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. 1.50 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, దళిత సంఘం నాయకుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.