ఊరూరా మహిళాబంధు వేడుకలు
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు
బొట్టుపెట్టి..హారతిపట్టి రాఖీ కట్టిన మహిళలు
జై కేసీఆర్, జైతెలంగాణ అంటూ నినాదాలు
దేవరకద్ర రూరల్, మార్చి 6 : మాకు రక్ష..సర్కారుకు మేము రక్ష అంటూ మహిళాలోకం ఏకమైంది. మూడు మహిళాబంధు పేరిట నిర్వహించే కార్యక్రమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులకు కట్టే కార్యక్రమం నిర్వహించారు. ఊరూరా సీఎం ఫ్లెక్సీలు చేసి బొట్టు పెట్టి..హారతి పట్టి రాఖీ కట్టారు. స్వరాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని గుర్తుచేసుకున్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ నినదించారు.
అన్నిరంగాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకద్ర మండలం పెద్దగోప్లాపూర్‌లో ఆదివారం నిర్వహించిన మహిళాబంధు సంబురాలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని శివాలయం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ, వైద్యసిబ్బంది, మహి ళా సంఘాల సభ్యులను ఘనంగా సన్మానించారు. అలా గే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అ భ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలన్నారు. 8వ తేదీన వనపర్తిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జె డ్పీటీసీ అన్నపూర్ణ, వైస్‌ఎంపీపీ సుజాత, మార్కెట్ కమి టీ చైర్పర్సన్ కొండా సుగుణ, తాసిల్దార్ జ్యోతి, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరాజు, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సర్పంచ్ మాధవీశ్రీనివా స్, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, శ్రీ కాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ప్రభుత్వం చేయూత
జడ్చర్లటౌన్, మార్చి 6 : అందరి అభ్యున్నతికి ప్రభు త్వం చేయూతనందిస్తున్నదని సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. మహిళాబం ధు సంబురాల్లో భాగంగా జడ్చర్లలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలతో కలిసి మానవహారం నిర్వహించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఆధ్వర్యంలో 8వ వార్డులో మున్సిపల్ మహిళా కార్మికులు, హౌసింగ్‌బోర్డు కాలనీవాసులను సన్మానించారు. 3వ వార్డులో కౌన్సిలర్ సతీ శ్ ఆధ్వర్యంలో మహిళలను సత్కరించారు. 4వ వార్డు లో కౌన్సిలర్ దేవా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మహిళలను సన్మానించారు. 6వ వార్డులో కౌన్సిలర్ రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి కాలనీ మహిళలు రాఖీలు కట్టారు. 21వ వార్డులో కౌన్సిలర్ వంగూర్ హరిత, 22వ వార్డులో కౌన్సిలర్ శ్రీశైలమ్మ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. 23వ వార్డులో కౌన్సిలర్ ఉమాశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో ము ఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 24వ వార్డులో కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వై ద్యసిబ్బందిని సత్కరించారు. 25వ వార్డులో కౌన్సిలర్ లత ఆధ్వర్యంలో కాలనీ మహిళలను సన్మానించారు.
ఆర్థికాభివృద్ధికి కృషి
రాజాపూర్, మార్చి 6 : మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నారని ఎంపీపీ సుశీల అన్నారు. మండలకేంద్రం లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశా రు. అనంతరం మహిళా కార్మికులను శా లువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మో హన్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, టీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు న రహరి, యాదగిరి, రామకృష్ణాగౌడ్, విజయ్, తిరుపత య్య, రియాజ్, ముస్తఫా, రాజునాయక్ పాల్గొన్నారు.
మహిళలకు ప్రత్యేక గుర్తింపు
తెలంగాణ వచ్చాక మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మ హిళాబంధు సంబురాల్లో భాగంగా గండీడ్‌లో ప్రజాప్రతినిధులకు మహిళలు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ, మాజీ జెడ్పీటీసీ లక్ష్మమ్మ, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపా ల్, డైరెక్టర్ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి, నాయకులు రాంచంద్రారెడ్డి, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, మార్చి 6 : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్త లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, మ హిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ పాల్గొన్నారు.
చిన్నచింతకుంట మండలంలో..
చిన్నచింతకుంట, మార్చి 6 : మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వైద్యసిబ్బందిని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి ఘనంగా సన్మానించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ను సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మోహన్‌గౌడ్, ప్రధానకార్యదర్శి జహంగీర్, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, మార్చి 6 : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో మహిళాబంధు సంబురాలను ఘనంగా జ రుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల స భ్యులు, పంచాయతీ కార్మికులు, ఆశ కార్యకర్తలు, అం గన్వాడీ టీచర్లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమాల్లో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహులు, చేతనారెడ్డి, రామకృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, రాములు, సు వర్ణ, మమత, హైమావతీవెంకట్రెడ్డి, గంగ్యానాయక్, విజయలక్ష్మి, సుకన్య, పద్మమ్మ పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, మార్చి 6 : సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కారూర్, జంగమయ్యపల్లి గ్రామాల్లో ఆశ కార్యకర్తలను సన్మానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ మాడమోని నర్సింహులు, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు లక్ష్మారెడ్డి, వెంకటేశ్, దర్పల్లి వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్, యాదయ్యయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మయ్య, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, మార్చి 6 : మండలంలోని యారోనిపల్లిలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులను సర్పంచ్ సుధ ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు అనంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.