కొత్తకోట, మార్చి 6: అవినీతి పుట్టింది కాంగ్రెస్లోనేనని, అది తెలియని ఆ పార్టీ నేతలు ఇతరులపై బురద చల్లడం సహించమని జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. పట్టణంలో మహిళాబంధు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్గౌడ్తో కలిసి రాఘవేంద్ర కల్యాణమండపంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. రైతుబంధు సంబురాలు ఎందుకని ప్రశ్నించే వారు.. నగదు తీసుకుంటున్న వారి తల్లిదండ్రులను వెళ్లి అడగాలన్నారు. మహిళలను ఎ క్కడ పూజిస్తే అక్కడ గౌరవం దక్కుతుందన్నారు. మంగళవారం నిర్వహించే బహిరంగసభకు దేవరకద్ర నియోజకవర్గం నుంచి 40వేలమంది తరలి రావాలని, కొత్తకోట నుంచి పదివేలకు పైగా ప్రజలు రావాలని కోరారు. అనంతరం బుక్కీపర్లకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మహిళా కౌన్సిలర్లు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, వైస్‌చైర్‌పర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, పీజేబాబు, మా ర్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, కౌన్సిలర్లు పద్మ అ య్యన్న, రాములుయాదవ్, తిరుపతయ్య, కొండారెడ్డి, మ హేశ్వరి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, కోఆప్షన్ సభ్యులు మిషేక్, వహీద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాబురెడ్డి, మహిళా అధ్యక్షులు ప్రసన్న లక్ష్మి, నాయకులు సుభాష్, సాజద్, వినోద్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన మహిళలు
మదనాపురం, మార్చి 6 : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మహిళాబంధు వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పద్మావతి అధ్వర్యంలో ఎంపీపీ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి మదనాపురం, కొత్తకోట మాజీ ఎంపీపీ శశిరేఖమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, కేక్ కట్‌చేసి సెల్ఫీలు దిగారు. అనంతరం ఎంపీపీ ఆయా రంగాలకు చెందిన ఆదర్శ మహిళలను శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు సముచితస్థానాన్ని కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనమంతా అండగా నిలవాలని, మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే బహిరంగసభకు మహిళలు మండలం నుంచి అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు పద్మమ్మ, బ్రహ్మమ్మ, శ్రావణి, అనిత, రాములమ్మ, అరుణ, శారద, ఎంపీటీసీలు సరస్వతి, శాంతమ్మ, ఉపసర్పంచ్ అనిత, వార్డు సభ్యురాళ్లు రాజేశ్వరి, పావని, ఏపీఎం కృష్ణవేణి, మహిళాసంఘం అధ్యక్షురాలు రేణుక, మాజీ అధ్యక్షురాలు అర్చన, సీసీ విజయలక్ష్మి, ప్రవళిక, రజిత, గాయత్రి, శ్రీలత, సుకన్య, రాధమ్మ, నారాయణమ్మ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మహిళాబంధు
అమరచింత, మార్చి 6: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాలమేరకు పట్టణంలో మహిళాబంధు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు నర్సింహులుగౌడ్ స్వగృహంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమంలో ఆయా కాలనీల మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల్‌నాయక్, మండల ప్రచార కార్యదర్శి రఫీ, మహిపాల్, పురుషోత్తం, రమేశ్, మహిళలు లింగమ్మ, భీమమ్మ, లక్ష్మి, మన్నెమ్మ, శివమ్మ, గోవిందమ్మ, సౌజన్య, చంద్రమ్మ, మన్నెమ్మ తదితరులు ఉన్నారు.