గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్
మహబూబ్‌నగర్, మార్చి 6 : ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ప్రతిపక్ష పార్టీలు లేనిపోని విమర్శలు చేయడం సరికాదని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో పాలమూరు పచ్చబడుతుంటే ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం పరితపించే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హాని చేయాలని చూస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. స మావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మైనార్టీసెల్ రాష్ట్ర నాయకుడు ఇంతియాజ్, టీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్లు ఖాజాపాషా, కట్టా కిషన్‌రెడ్డి, మోసిన్, పటేల్ ప్రవీణ్, నాయకులు వినోద్‌కుమార్, నవకాంత్, మనీష్, గణేశ్ ఉన్నారు.
ముక్తకంఠంతో ఖండించాలి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం చేయడాన్ని ము క్తకంఠంతో ఖండించాలని సంగీత, నాటక ఆకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో పట్టణ వీరశైవ లింగాయత్, లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బాద్మి మాట్లాడారు. మంత్రిపై హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వజ్రలిం గం, రాజసింహుడు, పోకల శివుడు, శ్రీశైలం, శంకర్లింగం, సిద్ధిలింగం, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
కుట్ర చేయడం దారుణం
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకుట్ర చేయడం దారుణమని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ సం ఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాధనకు శ్రీనివాస్‌గౌడ్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. అభివృద్ధికి కేరాఫ్‌గా మహబూబ్‌నగర్‌ను తీర్చిదిద్దుతున్న మంత్రిపై కుట్ర చేయడం హేయమైన చర్యన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వీ.బస్వరాజ్, బీబీపాల్, నారాయణ, భగవంతు, బుచ్చన్న, మోహన్‌రెడ్డి, ఎల్లప్పగౌడ్, శివరాములుగౌడ్, ఉమేశ్‌కుమార్, కృష్ణ ఉన్నారు.
హత్యా రాజకీయాలను సహించం
పాలమూరులో హత్యా రాజకీయాలను సహించమని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎస్.జగపతిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం కా ర్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మా ట్లాడారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై చేసిన హత్య కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఫోరం సభ్యులు వినోద్‌కుమార్, రాజసింహుడు, సుగుణ, నారాయణరెడ్డి, జయరాం, సిద్ధి రామప్ప, రఘుపతిరావు, గంగాధర్, శివన్న తదితరులు ఉన్నారు.
కఠినంగా శిక్షించాలి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కొండోజు రామాచారి, ప్రధానకార్యదర్శి రాంపురం రఘు అన్నారు. జి ల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషి తో మహబూబ్‌నగర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. జిల్లా అభివృద్ధికి శ్రమిస్తున్న మంత్రిపై హత్యకుట్ర చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. సమావేశంలో నాయకులు కృష్ణాచారి, హరీశ్ఆచారి, యుగేందరాచారి, చంద్రశేఖర్, రమేశ్ఆచారి, రవీంద్రాచారి ఉన్నారు.
దుర్మార్గమైన చర్య
పాలమూరు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర చేయడం దుర్మార్గమైన చర్య అని కాంట్రిబ్యూటరీ పెన్షన్‌దారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సనాతన బాలస్వామి ప్రకటనలో తెలిపారు. అందరి సంక్షేమానికి పాటుపడుతున్న మంత్రిపై కుట్ర చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.