ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
ఊట్కూర్, మార్చి 6: రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో పంచ్ మసీదు వద్ద రూ.5లక్షలతో మైనార్టీ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. అభివృద్ధిలో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు. ప్రజల ఆశీస్సులతో మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, కోఆప్షన్ మండల సభ్యుడు అబ్దుల్ రహెమాన్, ఉప సర్పంచ్ ఇబాదుల్ రహెమాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, వెంకటేశ్‌గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, ఆనంద్‌రెడ్డి, శివారెడ్డి, నాసీర్ఖాన్, జమీర్ పాల్గొన్నారు.
సీసీరోడ్డు పనులు పరిశీలన
మరికల్, మార్చి 6: మండలంలోని బుడ్డెగానితండాలో ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన సీసీరోడ్డు పనులను ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. సీసీరోడ్లు నాణ్యతతో వేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. రూ.5లక్షల వ్యయంతో వేస్తున్న సీసీరోడ్డు పనులను చూసి ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.