కొల్లాపూర్, మార్చి 3 : మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. పూత ఆలస్యంగా రావడం.., తెగుళ్లు వ్యాపించడంతోపాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత, పిందెలు రాలి కాపు కాయడం లేదు. రెండేండ్లుగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో నల్లతామర, బూడిద, తేనెబంక వంటి తెగుళ్లతో మామిడి రైతులు విలవిలలాడుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఎలాంటి ఉపయోగం లేదు. దిగుబడిపై రైతుల అంచనాలు తలకిందులయ్యా యి. దీంతో ఆర్థికంగా కుంగిపోతున్నారు. దేశంలోనే కొల్లాపూర్ మామిడికి ఎంతో పేరున్నది. అలాంటి చోట దిగుబడి లేక అన్నదాతలు నష్టాల్లో కూరుకుపోతున్నారు. చెట్లకు మామిడి పూతరాలి ఈనెలుగా మిగులుతున్నాయి. ఈ ఏడాది 30 శాతం మామిడి పూత, పిందెలు రాలిపోయినట్లు రైతులు వాపోతున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 9,390 మంది మామిడి తోటల రైతులు ఉన్నారు. 34,260 ఎకరాల్లో మామిడి సాగు చేయగా.. ఇందులో పంట దిగుబడినిచ్చే తోటల విస్తీర్ణం 28,580 ఎకరాలు ఉన్నది. పండ్ల తోటలకు ఉద్యానవన శాఖ, ఉపాధి హామీ పథకం ద్వారా సబ్సిడీలు ఇస్తుండడంతో ఏటా సాగు పెరుగుతున్నది. రైతులు బోర్లు, బావుల నీటిపైనే ఆధారపడి అధికంగా పండ్లతోటలను సాగుచేస్తున్నారు. నీటి ఆధారంలేని రైతులు ట్యాంకర్లతో, ఎడ్లబండ్లపై డ్రమ్ముల సాయంతో తోటను సంరక్షించుకుంటున్నారు. ఇంత కష్టపడి తోట సాగు చేస్తే.. పూత దశలో వివిధ తెగుళ్లు సోకడంతో దిగుబడి తక్కువ వస్తున్నది.
దంచికొడుతున్న ఎండలు..
ఇప్పటి నుంచే ఎండలు దంచికొడుతున్నా యి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఉష్ణోగ్రతలు మ రింత పెరిగే అవకాశం ఉన్నది. ఎండ తీవ్రతకు మామిడిపూత, పిందెలు నిలుస్తాయో లేదోనన్న భయం రైతులను వెంటాడుతున్నది. రాలిపోగా మిగిలిన పూత, పూత, పిందెలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నా రు. అక్కడక్కడ చెట్లకు పిందెలు పట్టినా.. ఎండ తీవ్రతకు నల్లతామర మచ్చలు ఏర్పడి రాలిపోతున్నాయి. రెండేండ్ల కిందటి వరకు జిల్లాలో 3.56 మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తే.. గతేడాది 73 మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్ర మే వచ్చింది. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 10,450 హెక్టార్లలో మామిడి తోటలు సాగుచేశారు. అయితే, జనవరి రెండో వారం నుంచి కొన్ని చెట్లకు పూత విరగపూసినా.. ఆ తరువాత పూత నిలవలేదు. పిందెలు, కాయలపై నల్లతామర మచ్చలు ఏర్పడి తారసిల్లి నేలరాలుతున్నాయి. కొల్లాపూర్‌లో సాగుచేసిన బేనిషాన్, తోతాపరి, చిన్న, పెద్ద రసాలు, బంగినపల్లి, రాణిపసంద్ రకాల మామిడి తోటల్లో పూత, పిందెలు నిలవడం లేదని రైతులు వాపోతున్నారు. సకాలంలో నీరందకపోవడం, ఎండల తీవ్రత కారణంగా పూత, పిందెలు రాలుతున్నాయంటున్నారు. తెగుళ్ల నివారణకు అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వారి సూచనల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నా పూత, పిందెలు రాలుతున్నాయి.
ఎప్పుడూ ఇలా చూడలే..
ఎత్తం శివారులోని ఆరెకాల్లో మామిడి తోట సాగు చేస్తున్నాను. కానీ ఇంతా పూత, పిందెలు రాలడం ఎప్పుడూ చూడలేదు. మొదట చెట్లకు పూత విపరీతంగా పట్టింది. రానురానూ పూత, బఠాణి సైజులో ఉన్న పిందెలు నేలరాలుతున్నాయి. పూతను చూసి సంబురపడ్డా. కానీ తీరా చూస్తే పూత నిలవకపోవడంతో నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– వెంకటయ్యగౌడ్, రైతు, ఎత్తం, కోడేరు మండలం
ఎన్ని మందులు కొట్టినా..
అన్నదమ్ముళ్లకు కలిపి 12 ఎకరాల్లో మామిడి తోట ఉన్నది. ప్రతి ఏటా రూ.13 లక్షలకు తోటను లీజ్‌కు ఇస్తుంటిమి. ఈసారి చెట్లకు పూత పట్టి రాలిపోతున్నది. ఎన్ని మందులు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇది మాకు పెద్ద నష్టం. పెట్టిన పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయినట్లే అని భయమేస్తున్నది.
– బడా గోపాల్‌యాదవ్, రైతు, చుక్కాయపల్లి,
కొల్లాపూర్ మండలం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి..
మామిడి తోటలకు వివిధ రకాల తెగుళ్లు వ్యాపించాయి. పూత నేలరాలడం, పిందెలు పసుపు రంగులోకి మారి రాలడం, తేనె మంచు, బూడి ద తెగుళ్లు సోకాయి. నల్లతామర పురుగుల సస్యరక్షణ నివారణకు రైతులు చర్యలు తీసుకోవాలి. పిప్రోనిల్ 80 శాతం మందును 80-100 గ్రాములు, హెక్టోకోనాజోల్ (కంటోప్ ప్లస్) 500 మిల్లీ లీటర్ల మం దును 500 లీటర్లలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే 50 శాతం మం దును చెట్ల మొదళ్లలో నేలపై పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించొచ్చు.
– లక్ష్మణ్, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్