ఎస్పీ రంజన్త్రన్‌కుమార్
అలంపూర్, ఫిబ్రవరి 26: సమాజంలో ఎటువంటి అభద్రతాభావం ఏర్పడినా, అశాంతి నెలకొన్నా రక్షణ శాఖకు సమాచారం అందించి సహకరించి పోలీసుల సహాయం పొందవచ్చని ఎస్పీ రంజన్త్రన్‌కుమార్ అన్నారు. అలంపూర్ పోలీస్‌స్టేసన్‌ను రూ.30లక్షలతో అధునాతన వసతుల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా నిర్మించిన పోలీస్‌స్టేసన్‌ను ఎస్పీ రంజన్త్రన్‌కుమార్, అదనపు ఎస్పీ రాములునాయక్, జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి శాస్త్రోక్తంగా, పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహేందర్‌రెడ్డి డీజీపీ, అంజనీకుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌శాఖకు అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. అలాగే ప్రజలు కూడా ఫ్రెండ్ల్లీ పోలీస్ పేరుతో పోలీస్‌వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీసులు, ప్రజలు ఒకరికొకరు కోఆర్డినేషన్లో ప్రభుత్వ సేవలు ఉపయోగించుకుని మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ మాట్లాడుతూ మండలంలో ఎస్పీ పర్యవేక్షణ, ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో సిబ్బంది పనితీరు బాగుందని, ప్రజల్లో పోలీసలంటే విశ్వాసం, నమ్మకం పెరిగిందని ఎస్పీకి, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయిలో పోలీసులకు ఎటువంటి సహాయ సహకారమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సర్పంచుల సంఘం తరఫున వివరించారు. కార్యక్రమంలో శాంతినగర్ సీఐ శివశంకర్, అలంపూర్ సీఐ సూర్యనాయక్, నియోజకవర్గంలోని ఎస్సైలు శ్రీహరి, జగన్మోహన్, గోకారి, వెంకటస్వామి, పోలీసులు ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.