
పాలమూరు జిల్లాకే వలసొస్తున్నారు. గతంలో వలసల జిల్లాగా పేరొందగా.. ఆ ముద్ర చెరిగి
పోతున్నది. నేడు ఉపాధి అవకాశాలు పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేస్తున్నారు. ఇప్పటికే భవన నిర్మాణాలకు, హమాలీ, పశు పోషణ, పౌల్ట్రీ పరిశ్రమ తదితర రంగాల్లో పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే పశ్చిమ బంగా (వెస్ట్ బెంగాల్)రాష్ట్రంలోని 24 పరిగణాలజిల్లా పాలి గ్రామానికి చెందిన 13 మంది కూలీలు మాత్రం వ్యవసాయ పనులు చేపట్టేందుకు వచ్చారు. సుమారు 1700 కి.మీ. దూరం నుంచి ఇక్కడికొచ్చి ఉపాధి పొందడం తొలిసారి. వీరంతా జడ్చర్ల మండలం కోడ్గల్, లింగంపేట గ్రామాల్లో వరి నాట్లు వేసే పనులు చేపడుతున్నారు. సీజన్లో పనులు ముగించుకొని తిరిగి తమ ప్రాంతానికి వెళ్తామని చెబుతున్నారు. తక్కువ కూలికే ఎక్కువగా పనులు చేస్తుండటంతో రైతులు వీరి
కోసం ఎదురుచూస్తున్నారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కనిపించేది పాలమూ రు కూలీలు. వలసల జిల్లాగా పేరు వచ్చేలా సమైక్య పాలకులు జిల్లాను ఆగం చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రమే పీ ఆ ముద్ర పోతోంది. వ్యవసాయ పనులు పెరిగి స్థానికంగా కూలీలు సైతం లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఇతర రాష్ర్టాల నుంచి వలస కూలీలు వచ్చి పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పాలమూరులో వరినాట్లు వేసేందు కు రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒక వైపు కూలీల కొరత.. మరోవైపు పెరిగిన కూలి రేట్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టుబడి పెరిగిపోతున్నదని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో తక్కువ ధరకే పనులు చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని కోడ్గల్, లింగంపేట గ్రామాల్లో పశ్చిమ బంగా (వెస్ట్ బెంగాల్) రాష్ర్టానికి చెం దిన కూలీలు వరి నాట్లు వేసేందుకు వచ్చారు. తమ ప్రాంతం లో పనులు లేక ఇక్కడికి వచ్చినట్లు వారు పేర్కొంటున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయకట్టు భారీగా పెరిగింది. నాడు కేవలం 2 లక్షల ఆయకట్టుకే నానా కష్టంగా ఉన్న ప రిస్థితి నుంచి నేడు సుమారు 12 ల క్షల ఎకరాలకు సాగు ఆయక ట్టు చేరింది. చివరకు వా గులు, వంకలపై కూడా చెక్ డ్యాంలు నిర్మిం చి సాగు భూములను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా లో వరి నాట్లు వేసేందుకు కూలీల కొరత ఏర్పడుతున్నది. దీని కి తోడు కూలి ధర కూడా రైతులకు భారంగా మారింది. ఈ తరుణంలో ఇతర రాష్ర్టాల నుంచి పాలమూరుకు వలస కూ లీలు వస్తున్నారు. వీరు తెలంగాణకు పక్క రాష్ర్టాలైన ఏపీనో లేక కర్ణాటకనో అనుకుంటే పొరపాటే. ఏకంగా వందల కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ బంగా నుంచి వలస కూలీలు పాలమూరుకు వచ్చి ఉపాధి వెతుక్కుంటున్నారు. ప్రపంచంలోని ఏ ప్రాజెక్టు నిర్మించినా గతంలో అక్కడ మన కూలీలు ఉండే పరిస్థితి. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి ఇక్కడికే వలస వస్తున్నారు. పశ్చిమ బంగా రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలోని పాలి గ్రామానికి చెందిన 13 మంది వలస కూలీలు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్, లింగంపేట గ్రామాల్లో వరినాట్లు వేస్తున్నా రు. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. సీజన్ మొత్తం పనులు చూసుకుని రైళ్లలో తిరిగి తమ ప్రాంతానికి వెళ్తామని బంగా కూలీలు చెబుతున్నారు. భవన నిర్మాణాలకు, హమాలీ, పశువుల పోషణ, పౌల్ట్రీ పరిశ్రమ తదితర రంగాల్లో పని చేయడానికి ఇప్పటికే పాలమూరుకు వివిధ రాష్ర్టాల నుంచి వలస కూలీలు వస్తున్నారు. అయితే పశ్చిమ బంగా నుంచి నాట్లు వేసేందుకు ఇంత దూరం రావడం మాత్రం ఇదే తొలిసారి.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకరా పొలంలో నా టు వేసేందుకు సు మారు రూ.7 వేలకు పైగా కూలి చెల్లించాల్సి ఉంటుంది. మన కూలీలు నారుమడిలో నారు పరిచే పని తమకు సంబంధం లేదని చెబుతారు. నారు పరిచేందుకు ఇద్దరు కూలీలు అదనం గా అవసరం పడుతారు. దీంతో నాటు ఖర్చు రూ.7 వేలతోపాటు అదనంగా రూ.1200 నారు పర్చడానికి రైతులపై భా రం పడుతున్నది. సాయంత్రం కల్లు, ఉదయం ఫిల్టర్ వాటర్, అన్నీ కలిపితే దాదాపు రూ.8,500 వరకు ఖర్చవుతుంది. కానీ పశ్చిమ బంగా కూలీలు మాత్రం ఎకరాకు కేవలం రూ.4,500 మాత్రమే తీసుకుని పని చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే వరి నాట్లు వేసేందుకు పనిలోకి వస్తున్నారు. నారు మడి నుంచి నారును తీయడం, నారును మడులలో పర్చుకోవడం, నాటు వేయడం మొత్తం పనులు వారే చేసుకుంటారు. దాంతో రైతులకు తక్కువలో తక్కువ ఎకరాకు దాదాపుగా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఆదా అవుతున్నది. పనులు కూడా వేగంగా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. వీరు రోజుకు కనీసం 4 నుంచి 5 ఎకరాలు నాటడం విశేషమని రైతులు చెబుతున్నారు. తక్కువ కూలీకి ఎక్కువ పనిచేసే కూలీలు కావడంతో రైతులు వీరి కోసం కోసం ఎదురుచూస్తున్నారు.
13 మందిమి ఉన్నాం. ఒక్క రోజులో నాలుగు నుంచి ఐదెకరాల్లో వరి నాట్లు వేస్తాం. దాంతో సుమారు రూ.వెయ్యి వరకు కూలి వస్తుంది. ఒక రోజు తక్కువ రావచ్చు.. మరో రోజు ఎక్కువ రావచ్చు. అదే మా రాష్ట్రంలో అయితే నాట్లు వేసే పనికి పోతే రోజుకు రూ.400 మాత్రమే గిట్టుబాటు అవుతుంది. అక్కడితో పోలిస్తే ఇక్కడ మాకు ఎక్కువ కూలీ లభిస్తోంది. ఇక్కడి ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. సీజన్ ఉన్నన్ని రోజులు పనులు చేసుకుని తర్వాత రైళ్లో మా ఊరికి వెళ్లిపోతాం.
స్థానికంగా చెక్ డ్యాంలను ఏర్పాటు చేయడం వల్ల వరద నీటిని అడ్డుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. రైతులు చెక్ డ్యాంలకు మోటర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. దీంతో కూలీల కొరత విపరీతంగా ఏర్పడింది. ఈ తరుణంలో పశ్చిమ బంగాకు చెందిన కూలీలు జడ్చర్ల మండలానికి వచ్చి నాట్లు వేస్తున్నారు. స్థానిక కూలీల కంటే తక్కువ ధరకే నాట్లు వేస్తుండటం వల్ల మన రైతులంతా వీరిని కూలీకి పిలవడానికే ఆసక్తి చూపుతున్నారు. పశ్చిమ బంగా కూలీలు ఎకరాకు రూ.4,500 మాత్రమే తీసుకోవడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతున్నది.
మా రాష్ట్రంలో వ్యవసాయ పనుల్లో తక్కువగా కూలి వస్తోంది. తెలంగాణలో వరి నాట్లకు కూలీల కొరత ఉన్నదనే సమాచారంతో ఇక్కడికి వలస వచ్చాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువగానే పని ఉన్నది. రోజుకు రూ.1000 వరకు కూలి పడుతోంది. మా ఊరిలో వచ్చే కూలితో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. వచ్చే సీజన్‌కు మాతో పాటు మరింత మందిని తీసుకుని వస్తాం. ఎంత మందికైనా ఇక్కడ పని లభిస్తుంది.